తెలంగాణకు ఐదు రోజులు రెయిన్ అలర్ట్ ప్రకటించింది ఐఎండీ. జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే చాన్స్ ఉంది. ఉరుములు, మెరుపులతో గంటకు 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయి. ఆదిలాబాద్, కొమ్రం భీమ్ ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, పెద్దపల్లి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, మెదక్ జిల్లాలకు ఎల్లో అలెర్ట్ జారీ చేసింది. ఆగస్టు 17న వికారాబాద్, సంగారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట్, జోగులాంబ గద్వాల జిల్లాల్లో భారీ వర్షం పడే అవకాశం ఉందని తెలిపారు వేదర్ ఆఫీసర్లు. హైదరాబాద్ లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయన్నారు హైదరాబాద్ వాతావరణ శాఖ సీనియర్ అధికారి శ్రావణి.
హైదరాబాద్ లో వర్షం దంచికొట్టింది. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, ఫిలింనగర్, గచ్చిబౌలి, ట్యాంక్ బండ్, లకిడికపూల్ తో పాటు అమీర్ పేట, పంజాగుట్ట, SR నగర్, ఎర్రగడ్డ, కూకట్ పల్లి, KPHB, నిజాంపేట్, ప్రగతి నగర్, బాచుపల్లి. పటాన్ చెరు, రామచంద్రపురం, అమీన్ పూర్, కుత్బుల్లాపూర్ డుందిగల్, బౌరంపేట్ ,గండి మైసమ్మ, అల్వాల్, మచ్చబోల్లారం ఏరియాల్లో వర్షం పడింది. నగరంలోని ప్రధాన ఏరియాల్లో వర్షాలతో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. భారీ ట్రాఫిక్ తో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. గచ్చిబౌలి, బయో డైవర్షిటీ, గచ్చిబౌలి, బయో డైవర్సిటీ, ఐకియా నుంచి హైటెక్ సిటీ వెళ్లే మార్గంలో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బంది పడ్డారు.
రంగారెడ్డి జిల్లా బండ్లగూడ జాగీర్ మున్సిపాలిటిలో భారీ వర్షం కురిసింది. దీంతో లోతట్టు ప్రాంతాలు చెరువులను తలపిస్తున్నాయి. రోడ్లపైకి మురుగు నీరు చేరడంతో కాలినడకన వెళ్లలేని పరిస్థితి నెలకొంది. వైష్ణవి ఒయాసిస్, లునట్ట విలాస్, సిరి ఎంక్లేవ్ కాలనీలు మురుగు నీరుతో నిండిపోయ్యాయి. చేవెళ్ల వెళ్లే రూట్ లో భారీగా వరద నీరు చేరడంతో పెద్ద సంఖ్యలో వాహనాలు నిలిచిపోయాయి. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బంది పడ్డారు.
ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు పడింది. పలు మండలాల్లో మధ్యాహ్నం నుంచి వర్షం పడటంతో లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. ప్రధాన రహదారులు, కాలనీల్లోకి భారీగా వరద నీరు చేరింది. వర్షం కారణంగా పలు ప్రాంతాల్లో విద్యుత్ కు అంతరాయం కలిగింది. జగిత్యాల జిల్లాలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షం పడింది. నిజామాబాద్ జిల్లాలోని పలు ప్రాంతాల్లో వర్షం దంచికొట్టింది. ఆర్మూర్ నియోజకవర్గంలోని మండలాల్లో ఉదయం నుంచి కుండపోతగా వర్షం పడింది. లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. కాలనీల్లో భారీగా వరద నీరు చేరడంతో జనం బయటకు వెళ్లలేని పరిస్థితి నెలకొంది. భీంగల్ మండలంలోని పలు గ్రామాలు జలమయం అయ్యాయి. విద్యుత్ కు అంతరాయం కలిగింది.
