వాతావరణ శాఖ కీలక ప్రకటన .. రానున్న మూడు రోజుల్లో భారీ వర్షాలు

వాతావరణ శాఖ  కీలక ప్రకటన .. రానున్న మూడు రోజుల్లో భారీ వర్షాలు

వాతావరణ శాఖ కీలక ప్రకటన చేసింది.  తెలంగాణలో రానున్న మూడు రోజుల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. అల్పపీడన ద్రోణీ కారణంగా ములుగు, కొత్తగూడెం, మహబూబాబాద్, వరంగల్, ఆసిఫాబాద్, మంచిర్యాల, కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి, హన్మకొండ, జనగామ, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశముందని తెలిపింది.  

మరోవైపు ఏపీలో కూడా 2023 ఆగస్టు 27 నుంచి వర్షాలు కురుస్తాయని  రాష్ట్ర విపత్తుల నిర్వహణ శాఖ ప్రకటన విడుదల చేసింది. శ్రీకాకుళం, పార్వతీపురం, అల్లూరి, తిరుపతి జిల్లాలతోపాటు చిత్తూరు, అన్నమయ్య, వైఎస్సార్‌ జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని  తెలిపింది.