రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో మోస్తారు నుంచి భారీ వర్షాలు..

రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో మోస్తారు నుంచి భారీ వర్షాలు..

గత రాత్రి రాష్ట్రంలోని పలు జిల్లాల్లో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిశాయని.. రాబోయే మూడు రోజుల వరకు భారీ వర్ష సూచన ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ వెల్లడించింది. మేడ్చల్ మల్కాజిగిరి దమ్మాయిగూడ ఏరియాలో 9 పాయింట్ ఐదు సెంటీమీటర్ల భారీ వర్షం నమోదవ్వగా అదే మేడ్చల్ మల్కాజిగిరి చర్లపల్లి ఏరియా లో 8.9 సెంటి మీటర్ల భారీ వర్షం కురిసింది,  కామారెడ్డి లోని బిచ్చు కుంటలో 8.3 సెంటీమీటర్లు, అదే కామారెడ్డి లోని జుక్కల్ లో 8 సెంటీమీటర్లు వర్షం పడింది.అలాగే ఖమ్మంలోని ఎం ఎస్ పి గెస్ట్ హౌస్ ఏరియాలో 7.6 సెంటీమీటర్లు, మేడ్చల్ మల్కాజిగిరి బాచుపల్లిలో 7 సెంటీమీటర్ల భారీ వర్షం నమోదయింది. మహబూబాబాద్ ,సంగారెడ్డి, నాగర్ కర్నూల్, మేడ్చల్ మల్కాజిగిరి, కామారెడ్డి, రంగారెడ్డి, నిజాంబాద్, సూర్యాపేట జిల్లాలో 4 సెంటి మీటర్ల నుంచి ఆరు సెంటీమీటర్ల మోస్తారు వర్షం కురిసిందని వాతావరణ శాఖ తెలిపింది.

ఇక గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని పలు ప్రాంతాల్లో రాత్రి భారీ నుండి మోస్తారు వర్షం పడింది.. చర్లపల్లి లో 4.4 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు,మచ్చ బొల్లారం లో 3.8 సెంటీమీటర్లు..కాప్రా లో 3.3 సెంటీ మీటర్లు..జీడిమెట్లలో 1.8 సెంటీమీటర్లు..షాపూర్ లో 1.7 సెంటీమీటర్లు..కుత్బుల్లాపూర్ లో ఒక సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. కాగా, ప్రస్తుతం కురుస్తున్న భారీ వర్షాలు, రాబోవు మూడు రోజుల వరకు భారీ వర్ష సూచనల నేపథ్యంలో నగర జోనల్, సర్కిళ్ల చీఫ్ జనరల్ మేనేజర్, సుపెరింటెండింగ్ ఇంజినీర్లతో దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ ఛైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ జి. రఘుమా రెడ్డి టెలీ కాన్ఫరెన్స్ ద్వారా విద్యుత్ సరఫరాపై సమీక్షా నిర్వహించారు. ఈ మేరకు పలు సూచనలు చేశారు.

గ్రేటర్ హైదరాబాద్ నగరం లోని డిజాస్టర్ మేనేజ్మెంట్ బృందాలు అప్రమత్తంగా ఉండాలి. చెట్లపై, రోడ్లపై మరియు గృహాలపై విద్యుత్ తీగలు తెగి పడ్డట్లు ఉంటే వాటికి దూరంగా ఉండి, వెంటనే విద్యుత్ శాఖ దృష్టికి తీసుకురావాలని తెలిపారు.రోడ్ల మీద నిల్వ ఉన్న నీళ్లలో విద్యుత్ వైర్లు గాని, ఇతర విద్యుత్ పరికరాలు మునిగి ఉన్నట్లయితే ఆ నీటిలోకి పోరాదు. సరఫరా సమస్యల పర్యవేక్షణ కోసం ప్రత్యేక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయాలన్నారు. విద్యుత్ కి సంబంధించి ఎలాంటి అత్యవసర పరిస్థితి వున్నా 1912 / 100 / స్థానిక ఫ్యూజ్ ఆఫ్ కాల్ ఆఫీస్ తో పాటు విద్యుత్ శాఖ ప్రత్యేక కంట్రోల్ రూమ్ 7382072104, 7382072106,7382071574 నకు ఫోన్ చేసి ఫిర్యాదు చేయాలని కోరారు. సంస్థ మొబైల్ ఆప్, వెబ్సైట్, ట్విట్టర్, ఫేస్ బుక్ ద్వారా కూడా విద్యుత్ సమస్యలు సంస్థ దృష్టికి తీసుకురావాలని  రఘుమా రెడ్డి సూచించారు. ఈమేరకు అధికారులు అప్రమత్తమైయ్యారు. నగరంలో కురుస్తున్న వర్షాలకు లోతట్టు ప్రాంతాల ప్రజలకు ఎలాంటి ఇబ్బంది పడకుండా అధికారులు ఏర్పాట్లు ముమ్మరం చేస్తున్నారు.