నాలుగు రోజులు భారీ వర్షాలు.. ఎల్లో అలర్ట్ జారీ చేసి వాతావారణ శాఖ

నాలుగు రోజులు భారీ వర్షాలు.. ఎల్లో అలర్ట్ జారీ చేసి వాతావారణ శాఖ

తెలంగాణలోని పలు జిల్లాల్లో భూగర్భ జలాలు అడుగంటి పంటలు ఎండిపోతుండటంతో రైతులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. ఈక్రమంలో వాతావరణశాఖ తీపి కబురు చెప్పింది. రానున్న నాలుగు రోజులపాటు రాష్ట్రంలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని వెల్లడించింది. సోమవారం హైదరాబాద్​, రంగారెడ్డి జిల్లాలతో పాటు ఉత్తర తెలంగాణ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని చెప్పింది. ఇక.. మంగళ, బుధవారాల్లో ఆదిలాబాద్, ఉమ్మడి వరంగల్, ఉమ్మడి నల్గొండ, ఉమ్మడి మహబూబ్​నగర్, ఉమ్మడి మెదక్, ఖమ్మం​ జిల్లాల్లో వానలు పడతాయని తెలిపింది. దీంతో పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్​జారీ చేసింది. దీంతో ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్​ జారీ చేసింది వాతావరణ శాఖ.

రాష్ట్రంలో ఆదివారం ఉదయం నుంచి వాతావరణం మారిపోయింది. చాలా చోట్ల మబ్బుపట్టింది. సడన్​గా టెంపరేచర్లూ తగ్గిపోయాయి. 40 డిగ్రీలలోపు టెంపరేచర్లు రికార్డయ్యాయి. అత్యధికంగా జోగులాంబ గద్వాల జిల్లా వడ్డేపల్లిలో 39.4  డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. వనపర్తి జిల్లాలో 39.3, నాగర్​కర్నూల్​లో 39.2, ఆదిలాబాద్​లో 39 డిగ్రీల చొప్పున టెంపరేచర్లు నమోదయ్యాయి. మిగతా జిల్లాల్లో 38లోపే ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి. పలు చోట్ల వర్షపాతం నమోదైంది. అత్యధికంగా సంగారెడ్డి జిల్లా నాగలగిద్దలో 3.4 సెంటీమీటర్ల వర్షం పడింది. కంగ్టిలో 2.3 సెంటమీటర్ల వర్షపాతం నమోదైంది. 

కాగా, తెలంగాణతో పాటు మధ్యప్రదేశ్, విదర్భ, ఛత్తీస్​గఢ్​, ఒడిశా, జార్ఖండ్​ రాష్ట్రాల్లో వడగండ్లతో కూడిన వర్షం పడనున్నట్లు భారత వాతావరణ శాఖ ప్రకటించింది.