ఐదు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు వాగులు, చెరువులు పొంగిపొర్లుతున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా మహారాష్ట్ర నుంచి గోదావరి నదికి వరద ప్రవాహం భారీగా కొనసాగుతోంది. దీంతో ఉమ్మడి వరంగల్ జిల్లాలోని భూపాలపల్లి, ములుగు, ఏటూరు నాగారం ప్రాంతాల్లో గోదావరి నది మహోగ్రరూపం దాల్చింది. రామన్నగూడెం పుష్కరఘాట్ వద్ద రెండో ప్రమాద హెచ్చరిక చేరువలో ఉంది. రామన్నగూడెంలో 9.840 మీటర్ల ఎత్తులో గోదావరి నది ప్రవహిస్తోంది.
దీంతో అప్రమత్తమైన అధికార యంత్రాంగం.. సమీప గ్రామాల ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు. అయితే పునరావాస కేంద్రాల్లో ఎలాంటి వసతులు లేకపోవడంతో ప్రజలు అవస్థలు పడుతున్నారు. శనివారం రాత్రి 9 గంటల నుంచి ఆదివారం మధ్యాహ్నం వరకు ఎలాంటి ఆహారం అందించలేదని బాధితులు వాపోతున్నారు.

