రాష్ట్రంలో పలు చోట్ల భారీ వర్షాలు 

రాష్ట్రంలో  పలు చోట్ల భారీ వర్షాలు 

హైదరాబాద్ లో ఒక్కసారిగా వాతావరణం మారింది. పలు ప్రాంతాల్లో వర్షం దంచి కొడుతోంది. బంజారాహిల్స్, జూబ్లిహిల్స్ లో భారీ వర్షం కురిసింది. అమీర్ పేట్, ఖైరతాబాద్, నాంపల్లిలో వర్షం పడుతోంది. ఒక్కసారిగా కురిసిన వానలతో రోడ్లపై వరద నీరు చేరింది. దీంతో వాహనదారులు ఇబ్బంది పడుతున్నారు.

నగరంలో పలు ప్రాంతాల్లో కురిసిన వర్షానికి ట్రాఫిక్ జాం అయ్యింది. సిటితో పాటు పలు జిల్లాల్లో వచ్చే మూడు గంటల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉందిని వాతావరణ శాఖ హెచ్చరించింది. కొన్ని చోట్ల ఉరుములు, మెరుపులతో వర్షం పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.