శని, ఆదివారాల్లో భారీ వర్షాలు

శని, ఆదివారాల్లో భారీ వర్షాలు

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో ఈ నెల 6, 7న (శని, ఆదివారాల్లో) భారీ నుంచి అతి భారీ వర్షాలు పడొచ్చని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఆ రెండ్రోజుల పాటు ఆరెంజ్ అలర్ట్ ఉంటుందని చెప్పింది. శనివారం రంగారెడ్డి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, మహబూబ్ నగర్ జిల్లాల్లో..  7న మహబూబాబాద్, వరంగల్, జనగామ, సిద్దిపేట జిల్లాల్లో భారీ వర్షాలు ఉంటాయని హెచ్చరించింది.  బుధవారం వనపర్తి జిల్లా గోపాల్ పేటలో 10.3 సెంటీమీటర్ల అత్యధిక వర్షపాతం నమోదైంది. నిర్మల్ జిల్లా విశ్వనాథ్ పేట్​లో 7.3 సెం.మీ. వర్షపాతం నమోదైంది.