బంగాళాఖాతంలో అల్పపీడనం

బంగాళాఖాతంలో అల్పపీడనం

హైదరాబాద్, వెలుగు : వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం  ఒడిశా, పశ్చిమ బంగాల్ తీరంలో కొనసాగుతోందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ ప్రభావంతో ఉత్తర, తూర్పు తెలంగాణ జిల్లాల్లో మరో 2రోజుల పాటు అక్కడక్కడ భారీ వర్షాలు పడే అవకాశముందని సూచించింది. తాజా అల్పపీడనంతో మరో 2రోజులు 17, 18 తేదీల్లో వర్షంతో కూడిన వాతావరణం ఉంటుందని తెలిపింది. 15 వరకే భారీ వర్షా లు ఉంటాయని తొలుత అంచనా వేసినా తాజాగా మరో అల్పపీడనం ఏర్పడడంతో వర్షాలు పడే చాన్స్​ ఉంది. వాతావరణ శాఖ హెచ్చరికలు ఆందోళనకు గురిచేస్తున్నాయి.