వేములవాడరూరల్, వెలుగు: వేములవాడలోని శ్రీరాజరాజేశ్వర స్వామి దేవస్థానం అనుబంధ ఆలయమైన భీమేశ్వరస్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. సోమవారం దర్శనానికి వివిధ ప్రాంతాల నుంచి భక్తులు భారీగా తరలిరావడంతో క్యూలైన్లు భక్తులతో నిండిపోయాయి. స్వామి వారిని దర్శించుకొని కోడె మొక్కులు చెల్లించుకున్నారు. మహిళలు అమ్మవారికి ఒడి బియ్యం సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు.

