తిరుమలకు పోటెత్తిన భక్తులు..సర్వదర్శనానికి 24 గంటలు...

తిరుమలకు పోటెత్తిన భక్తులు..సర్వదర్శనానికి 24 గంటలు...

కలియుగ వైకుంఠం తిరుమలకు పోటెత్తారు భక్తులు. వరుస సెలవులు వీకెండ్ కావడంతో భక్తులు శ్రీవారి దర్శనానికి భారీగా తరలి వచ్చారు. ఈక్రమంలో శనివారం ( జూన్ 27 ) వైకుంఠంలో అన్ని కంపార్టుమెంటులు భక్తులతో కిటకిటలాడుతున్నాయి.బయట గోగర్భం డ్యామ్ వరకు క్యూలైన్లలో బారులు తీరారు భక్తులు. 

ఈ క్రమంలో ఉచిత సర్వదర్శనానికి 24 గంటలు, SSD టోకన్ భక్తులకు 10 గంటలు, రూ. 300/- ప్రత్యేక ప్రవేశ దర్శనానికి సుమారు 8 గంటల సమయం పడుతోందని సమాచారం. 

ఇదిలా ఉండగా.. శుక్రవారం తిరుమల శ్రీవారిని 81 వేల 340 మంది భక్తులు దర్శించుకోగా... 44 వేల 874 మంది భక్తులు తలనీలాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారని తెలిపారు టీటీడీ అధికారులు.శ్రీవారి హుండీ ఆదాయం రూ. 3 కోట్ల 76 లక్షలు వచ్చినట్లు టిటిడి అధికారులు తెలిపారు.