నానక్ రామ్ గూడ యూఎస్ కాన్సులేట్ వద్ద భారీ బందోబస్తు.. హైదరాబాద్ లో ఇరాన్ కు అనుకూలంగా ర్యాలీల అవకాశం

నానక్ రామ్ గూడ యూఎస్ కాన్సులేట్ వద్ద భారీ బందోబస్తు.. హైదరాబాద్ లో ఇరాన్ కు అనుకూలంగా ర్యాలీల అవకాశం

గచ్చిబౌలి, వెలుగు: అమెరికా, ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య యుద్ధం నేపథ్యంలో నానక్​రామ్​గూడలోని యూఎస్ కాన్సులేట్ వద్ద సైబరాబాద్ పోలీసులు కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ మృతితో సిటీ ఇరాన్ అనుకూల ర్యాలీలు జరిగే అవకాశం ఉండడంతో ఆదివారం గచ్చిబౌలి పోలీసులు కాన్సులేట్ చుట్టుపక్కల సుమారు 50 మంది బలగాలతో బందోబస్తు నిర్వహించారు.

కాన్సులేట్ వైపు వెళ్లే రహదారులను తాత్కాలికంగా భారీ గేట్లతో మూసివేసి, వాహనాలను క్షుణ్ణంగా తనిఖీ చేసిన తర్వాతే అనుమతిస్తున్నారు. అలాగే సమీపంలోని స్టార్ హోటళ్లలో బస చేసిన అనుమానిత వ్యక్తులపై నిఘా పెంచామని, శాంతి భద్రతల దృష్ట్యా ఈ చర్యలు తీసుకున్నట్లు గచ్చిబౌలి పోలీసులు తెలిపారు.