పండుగ టూరు..టోల్ ప్లాజా వద్ద బారులు.. రాయికల్ టోల్ వద్ద భారీగా ట్రాఫిక్ జామ్

పండుగ టూరు..టోల్ ప్లాజా వద్ద బారులు.. రాయికల్ టోల్ వద్ద భారీగా ట్రాఫిక్ జామ్

షాద్​నగర్​, వెలుగు :  దసరా సందర్భంగా ఊరెళ్తున్న వారితో హైదరాబాద్​– బెంగళూరు హైవే కిక్కిరిసిపోయింది. షాద్ నగర్ సమీపంలోని రాయికల్ టోల్ ప్లాజా వద్ద ఆదివారం వాహనాల రద్దీ కొనసాగింది. వీకెండ్​తో పాటు పండుగ దగ్గర పడడంతో ఆదివారం వాహనాల సంఖ్య భారీగా పెరిగింది. దీంతో టోల్ ప్లాజా వద్ద తీవ్ర రద్దీ నెలకొని కిలోమీటర్ల మేర వాహనాలు బారులు తీరాయి. 

దీంతో ట్రాఫిక్ పోలీసులు రంగంలోకి దిగి అదనపు లేన్లను తెరిచి ట్రాఫిక్​ను క్రమబద్ధీకరించారు. ట్రాఫిక్ రద్దీని దృష్టిలో ఉంచుకుని వీలైనంతవరకు ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవాలని పోలీసులు సూచించారు.