తిరుమల కొండపై హెలికాప్టర్ కలకలం.. ఆలయం పైన చక్కర్లు

తిరుమల కొండపై హెలికాప్టర్ కలకలం.. ఆలయం పైన చక్కర్లు

 తిరుమల కొండపై మరోసారి  హెలికాప్టర్​ వెళ్లడంతో కలకలం రేగింది.  ఆగమ శాస్త్ర నియమాల ప్రకారం తిరుమల ఆలయంపై ఎలాంటి విమానాలు.. హెలికాఫ్టర్లు  ప్రయాణించకూదు.  అలా వెళ్లడం వలన ఆలయ పవిత్రత దెబ్బతింటుంది.  ఈ రోజు ( జూన్​ 17) ఉదయం శ్రీవారి  ఆలయంపై ఓ హెలికాప్టర్ చక్కర్లు కొట్టింది. 

తిరుమలను నో ఫ్లైయింగ్  జోన్ గా  ప్రకటించాలని అనేక మార్లు కోరన కేంద్ర విమానయాన శాఖను టీటీడీ కోరింది. ప్రస్తుత కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడుకి టీటీడీ  గతంలోనే లేఖ రాసింది. త్వరలో ఈ విషయంపై సాధ్యాసాధ్యాలను అధ్యయనం చేసి  పౌర విమానయానశాఖ నిర్ణయం తీసుకోనుంది.