- – హన్మకొండ నుంచి ట్రిప్పులు
- - నేటి నుంచి ప్రారంభం
మేడారం సమ్మక్క, సారలమ్మలను దర్శించుకునేందుకు వచ్చే భక్తులకోసం హెలికాప్టర్ సేవలు ప్రారంభమయ్యాయి. మేడారం వచ్చే భక్తులు కోసం హనుమకొండ నుంచి మేడారం వరకు గురువారం (జనవరి 22) నుంచి పదిరోజుల పాటు ఈ సేవలు హెలికాప్టర్ సేవలు అందుబాటులో ఉంటాయి. ఆకాశం నుంచి మేడారం జాతర దృశ్యాలను తిలకించేందుకు కూడా ఈ హెలికాప్టర్ రైడ్స్ ఏర్పాటు చేశారు.
హనుమకొండ నుంచి మేడారం వచ్చే భక్తులకు గురువారం ( జనవరి 22) నుంచి జనవరి 31 వరకు హెలికాప్టర్ సేవలు అందుబాటులోకి వచ్చాయి. ఇందుకోసం మేడారం లోని పడిగాపూర్ దగ్గర హెలిప్యాడ్ ఏర్పాటు చేశారు. 6-7 నిమిషాల జాతర విహంగ వీక్షణ జాయ్ రైడ్ కు ఒక్కొక్కరికి రూ.4వేల 800 ఛార్జ్ చేస్తారు. హనుమకొండ నుంచి మేడారం అప్ డౌన్ కు రూ.35వేల999 లు ఛార్జీలు వసూలు చేస్తారు. జనవరి 31 వరకు ఉ.8 గంటల నుంచి సాయంత్రం 5.20 వరకు అందుబాటులో హెలికాప్టర్ రెడ్స్ అందుబాటులో ఉంటాయి.
ములుగు, వెలుగు: మేడారం మహాజాతరకు వచ్చే భక్తులకు హెలికాప్టర్ సేవలు అందుబాటులోకి వచ్చాయి. జనవరి 28నుంచి మహాజాతర ప్రారంభం కానుండగా ఈ సర్వీసులను వారం ముందు నుంచే ప్రారంభిస్తున్నారు. తెలంగాణ టూరిజం శాఖ ఆధ్వర్యంలో తుంబి ఎయిర్ లైన్స్ఈ సేవలను అందుబాటులోకి తీసుకువస్తున్నది. మేడారం సమీపంలోని పడిగాపూర్వద్ద ఉన్న హెలిప్యాడ్ నుంచి జాయ్‌రైడ్ ఫ్రారంభం అవుతుంది. హెలికాప్టర్ సేవలకు.. 6 నుంచి 7నిమిషాల రైడ్ కు ఒక్కొక్కరి నుంచి రూ.4, 800 చార్జ్ చేయనున్నట్టు నిర్వాహకులు తెలిపారు. అదేవిధంగా హన్మకొండ నుంచి మేడారం జాతరకు రావాలనుకునే భక్తులకు కూడా ఈ హెలికాప్టర్ సేవలు అందుబాటులోకి వచ్చాయి.
హన్మకొండలోని ఆర్ట్స్అండ్సైన్స్కాలేజీ గ్రౌండ్స్ లో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్ నుంచి మేడారానికి ఒక్కొక్కరి నుంచి రూ.35వేల 999లు చార్జ్చేయనున్నట్టు నిర్వాహకులు వెల్లడించారు. జాతర ముగిసే తేదీ 31 వరకు హెలికాప్టర్ సేవలు భక్తులకు అందుబాటులో ఉండనున్నాయి. సర్వీసులు ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు మాత్రమే కొనసాగనున్నాయి. పూర్తి వివరాలకు 8530004309, 9676320139 నెంబర్లలో సంప్రదించాలని నిర్వాహకులు సూచించారు.
