వన్ రూపీ చాలెంజ్ తో సాయం

వన్ రూపీ చాలెంజ్ తో సాయం
  • వన్ రూపీ చాలెంజ్ స్టార్ట్ చేసిన హైదరాబాదీ
  • వచ్చిన ఫండ్స్ తోమాస్క్ లు,శానిటైజర్స్,ఫుడ్ డిస్ట్రిబ్యూషన్
  • ఇప్పటి వరకు2,500 మందికి పైగా సాయం

లాక్ డౌన్ లో సెలబ్రిటీల కుకింగ్, హోం క్లీనింగ్ , పిల్లో లాంటి డిఫరెంట్ చాలెంజెస్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. కామన్ పీపుల్ సైతం టిక్ టాక్, ఇన్స్టా, ఫేస్ బుక్ లో ఒకరికొకరు చాలెంజ్ లు విసురుకుంటూ టైంపాస్ చేశారు. సోషల్ కాజ్ తో ఏదైనా చేయాలని భావించిన సిటీకి చెందిన శశాంక్, అతడి ఫ్రెండ్స్ కొత్తగా వన్ రూపీ చాలెంజ్ ను స్టార్ట్ చేశారు. రూపాయి డొనేట్ చేయాలంటూ తమకు తెలిసిన వారిని నామినేట్ చేశారు.దీని ద్వారా వచ్చిన డబ్బుతో లాక్డౌన్లో ఇబ్బంది పడే వారికి సాయం అందిస్తున్నారు.

సోషల్ మీడియా ద్వారా క్యాంపెయిన్

లాక్ డౌన్ ప్రకటించిన 25 రోజులకు ఈ చాలెంజ్ ను స్టార్ట్ చేసిన శశాంక్ టీమ్ సోషల్ మీడియాను ప్లాట్ ఫా మ్ గా చేసుకుని ఫేస్ బుక్, వాట్సాప్ లోగ్రూప్స్ ను క్రియేట్ చేసింది. వారు స్టేటస్ పెట్టుకుని తర్వాత ఫ్రెండ్స్ కు చాలెంజ్ విసిరారు. దీనికి రెస్పాండైన వారు గూగుల్ పే, ఫోన్ పే, పేటీఎం ద్వారా వన్ రూపీ ట్రాన్స్ ఫర్ చేసి దాన్ని స్క్రీన్ షాట్ తీసి సోషల్ అకౌంట్స్ లో  పోస్ట్, ట్యాగ్ చేసేవారు. ఇలా మిగతావారిని నామినేట్ చేస్తూ ఒక చెయిన్ గా మారి వన్ రూపీ ఛాలెంజ్ ని స్ప్రెడ్ చేశారు. సిటీతో పాటు మిగతా ప్రాంతాలకు చెందినవారుఈ క్యాంపెయిన్ లో పార్టిసిపేట్ చేసి వన్ రూపీ డొనేట్ చేశారని శశాంక్ తెలిపాడు.ఇప్పటివరకు 50వేలకుపైగా ఫండ్స్ వచ్చాయన్నాడు. వీటితో మాస్క్ లు, శానిటైజర్లు, గ్లౌజ్ లు, గ్లూకోవాటర్ బాటిల్స్,స్నాక్స్ కొని కరోనాతో ఫైట్ చేస్తున్న జీహెచ్ఎంసీ వర్కర్స్, పోలీసులకు అందించామన్నాడు. ఇది కాకుండా ఆకలితో ఉన్న వలస కార్మికులకు ఫుడ్ ప్యా కెట్లు పంచామని..ఇప్పటివరకు 2,500 మందికిపైగా సాయం చేశామన్నాడు.

యూజ్ ఫుల్ గా ఉండాలని..

కన్ స్ట్రక్షన్ ఫీల్డ్ లో వర్క్ చేస్తున్నా. లాక్ డౌన్ టైమ్ లో సోషల్ మీడియాలో వస్తున్న చాలెంజ్ లు చూసి వీటికి జనాలు బాగా కనెక్ట్ అయ్యారని అర్థమైంది. అందుకే సోషల్ కాజ్ తో డిఫరెంట్ గా చేద్దా మని వన్ రూపీ చాలెంజ్ మొదలుపెట్టాం. ఈ క్యాంపెయిన్ లో పార్టిసిపేట్ చేసేవారు వన్ రూపీ ట్రాన్స్ ఫర్ చేస్తే యాక్సెప్ట్ చేసినట్లు అవుతుంది. తర్వాత వీళ్లు వారి ఫ్రెండ్స్ ని నామినేట్ చేయొచ్చు. ఇది మొదలుపెట్టిన కొన్నిరోజులకే మంచి రెస్పాన్స్ వచ్చింది. దీన్ని అలాగే కంటిన్యూ చేస్తున్నాం.

 ‑ శశాంక్, వన్ రూపీ చాలెంజ్ క్రియేటర్