కావేరీ జలాల్ని కాపాడుదాం రండి: కాజల్

కావేరీ జలాల్ని కాపాడుదాం రండి: కాజల్

హీరోయిన్లందరూ తమ సినిమాలు చూడమని అభిమానుల్ని ఇన్వైట్ చేస్తుంటారు. కానీ కాజల్ మాత్రం తనతో పాటు సేవా కార్యక్రమాల్లో పాల్గొనడానికి రమ్మంటూ అందరినీ ఆహ్వానిస్తోంది. చేతినిండా సినిమాలతో బిజీబిజీగా కూడా ఉంది. అయినా కూడా కాస్త సమయాన్ని సమాజ సేవకు కూడా ఉపయోగిస్తొంది. గిరిజన ప్రాంతాలను అభివృద్ధి చేయడానికి ఒక స్వచ్ఛంద సంస్థతో కలిసి కృషి చేస్తోంది. ఇప్పుడు కావేరీ జలాలను కాపాడేందుకు నడుం కట్టింది.

‘కావేరి నది మెల్లమెల్లగా ఎండిపోతోంది. అది చూస్తుంటే నా మనసు కదిలిపోతోంది. అందుకే కావేరీ జలాల్ని కాపాడే కార్యక్రమంలో నేనూ పాలుపంచుకుంటున్నాను. విరాళాలు సేకరిస్తున్నాను. మీరూ చేతనైనంత చేయండి. కావేరి మనల్ని పిలుస్తోంది’ అంటూ కాజల్ పిలుపునిస్తోంది. చెట్లను నాటమని ప్రోత్సహిస్తోంది. ఇంత బిజీలోనూ సొసైటీ కోసం ఆలోచిస్తున్న కాజల్‌ మంచి మనసును అందరూ మెచ్చుకుంటున్నారు. ఆమె అభిమానులు కూడా చారిటీకి ముందుకొస్తున్నారు. రీసెంట్ గా రణరంగం, కొమాలి చిత్రాలతో వచ్చింది కాజల్. ప్రస్తుతం ‘భారతీయుడు 2’ సినిమాకి పని చేస్తోంది. మరికొన్ని సినిమాలు చేతిలో ఉన్నాయి. కొన్ని డిస్కషన్స్ నడుస్తున్నాయి. అయినా కూడా సమాజం గురించి ఇలా ఆలోచిస్తున్నందుకు మెచ్చుకుని తీరాల్సిందే.