V6 News

ధనుష్ సరసన 'ధురంధర్' బ్యూటీ.. రుక్మిణి వసంత్ ప్లేస్‌లో సారా అర్జున్‌కు బంపర్ ఆఫర్!

ధనుష్ సరసన 'ధురంధర్' బ్యూటీ.. రుక్మిణి వసంత్ ప్లేస్‌లో సారా అర్జున్‌కు బంపర్ ఆఫర్!

చైల్డ్ ఆర్టిస్ట్ గా విక్రమ్  'నాన్న' సినిమాలో తన అమాయకత్వంతో అందరినీ ఏడిపించిన సారా అర్జున్.. ఇప్పుడు వెండితెరపై సంచలనాలు సృష్టిస్తోంది. ఇటీవల విడుదలైన ఆదిత్య ధర్ భారీ యాక్షన్ ఎపిక్ 'ధురంధర్ 2' (Dhurandhar 2: The Revenge) చిత్రంతో ఆమె ఒక్కసారిగా నేషనల్ స్టార్‌గా మారిపోయింది. ఈ క్రమంలోనే ఈ యువ సుందరి సౌత్ ఇండియన్ సూపర్ స్టార్ ధనుష్ సరసన కథానాయికగా ఎంపికైందనే వార్త ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది.

రుక్మిణి వసంత్ స్థానంలో సారా?

తమిళ దర్శకుడు తమిళరసన్ పచ్చముత్తు దర్శకత్వంలో ధనుష్ ఒక ప్రాజెక్ట్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. మొదట ఈ సినిమాలో కన్నడ బ్యూటీ రుక్మిణి వసంత్‌ను హీరోయిన్‌గా ఎంపిక చేశారు. అయితే, ఆమె ఎన్టీఆర్–ప్రశాంత్ నీల్ భారీ ప్రాజెక్ట్‌కు డేట్స్ కేటాయించడం వల్ల డేట్ల సర్దుబాటు కుదరక ఈ ప్రాజెక్ట్ నుండి తప్పుకున్నట్లు తెలుస్తోంది. ఈ ఖాళీని భర్తీ చేసేందుకు మేకర్స్ ఇప్పుడు సారా అర్జున్‌ను సంప్రదించినట్లు సమాచారం. ఇది అధికారికంగా ఖరారైతే ధనుష్ - సారా కాంబినేషన్ బాక్సాఫీస్ వద్ద సరికొత్త మేజిక్ చేయడం ఖాయం అని ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు.

'ధురంధర్ 2' సునామీ!

సారా అర్జున్ ప్రస్తుతం 'ధురంధర్ 2' విజయంతో ఫుల్ జోష్ లో ఉంది. రణవీర్ సింగ్ హీరోగా నటించిన ఈ చిత్రం బాహుబలి, పుష్ప వంటి రికార్డులను సైతం తిరగరాసింది. ఈ సినిమాలో ఆమె రణవీర్ భార్య 'యాలినా' పాత్రలో అద్భుతమైన నటనను కనబరిచింది. కరాచీ అండర్ వరల్డ్ నేపథ్యంలో సాగే ఈ సైకలాజికల్ వార్‌లో సారా నటనకు విమర్శకుల నుండి ప్రశంసలు దక్కాయి. ప్రపంచ వ్యాప్తంగా ఈ మూవీ ఫ్రాంచైజ్ రూ. 3వేల కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి.. బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతుంది.

►ALSO READ | అమరేంద్ర బాహుబలి మరణం తర్వాత ఏం జరిగింది? అన్నెసీ ఫెస్టివల్‌లో 'ది ఎటర్నల్ వార్' సంచలనం!

ధనుష్ చేతిలో క్రేజీ ప్రాజెక్టులు

ధనుష్ ప్రస్తుతం కేవలం నటుడిగానే కాకుండా దర్శకుడిగా కూడా బిజీగా ఉన్నారు. అమరన్ దర్శకుడు రాజ్‌కుమార్ పెరియసామి దర్శకత్వంలో ధనుష్ తన 55వ సినిమాను ప్రకటించారు. వండర్ బార్ ఫిల్మ్స్ నిర్మిస్తున్న ఈ చిత్రం భారీ స్థాయిలో తెరకెక్కనుంది. మమితా బైజు హీరోయిన్‌గా నటిస్తున్న  కారా (Kara) చిత్ర ప్రమోషన్లలో ధనుష్ బిజీగా ఉన్నారు. ఇందులో జయరామ్, సురాజ్ వెంజరమూడు వంటి స్టార్ నటులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.

ప్రస్తుతం గ్లామర్‌తో పాటు నటనకు ప్రాధాన్యమున్న పాత్రలను ఎంచుకుంటూ సారా అర్జున్ దూసుకుపోతోంది. ధనుష్ వంటి జాతీయ అవార్డు గ్రహీతతో ఆమె జోడీ కడితే, అది ఆమె కెరీర్‌కు మరో టర్నింగ్ పాయింట్ కానుందని సినీ వర్గాలు అంచనా వేస్తున్నాయి.