V6 News

5 రూపాయలే ఇచ్చావ్ ఏంట్రా : బిచ్చగాడి దౌర్జన్యంతో బిత్తరపోయిన వ్యాపారులు..!

5 రూపాయలే ఇచ్చావ్ ఏంట్రా : బిచ్చగాడి దౌర్జన్యంతో బిత్తరపోయిన వ్యాపారులు..!

బిచ్చగాడు.. పాపంలే పోనీ అనుకునే రోజులు పోయాయి.. బిచ్చగాడు కదా అని టిఫిన్ తింటావా.. భోజనం చేస్తావా.. టీ తాగుతావా అంటే.. అవన్నీ వద్దుకానీ.. డబ్బులు ఇవ్వు అని డిమాండ్ చేసే రోజులు వచ్చాయి.. చిల్లర లేదు అంటే QR కోడ్ చూపించి బిచ్చం డిమాండ్ చేసే రోజులు వచ్చాయి.. అంతెందుకు.. తెలంగాణ రాష్ట్రం మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో జరిగిన ఘటన షాకింగ్ గా మారింది. 

మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని రోడ్లపై అడుక్కుంటున్న బిచ్చగాడు.. ఓ షాపు దగ్గరకు వచ్చాడు. పాపం బిచ్చగాడు అని.. షాపు యజమాని ఐదు రూపాయలు ఇచ్చాడు.. ఆ ఐదు రూపాయల బిల్ల చూసిన తర్వాత బిచ్చగాడికి ఎక్కడ లేని కోపం వచ్చింది. ఐదు రూపాయలు ఏంట్రా ఐదు రూపాయలు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఇంకా ఇవ్వు అంటూ డిమాండ్ చేశాడు.. బిచ్చగాడి బిహేవియర్ తో షాపు యజమాని షాక్ అయ్యాడు.. ఇచ్చింది తీసుకో.. లేకపోతే వెళ్లిపో అంటూ ఆగ్రహం వ్యక్తం చేశాడు షాపు యజమాని.

ఈ క్రమంలోనే బిచ్చగాడిలో రౌద్రం తన్నుకు వచ్చింది. షాపు యజమానిపైనే దాడికి ప్రయత్నించాడు. తన దగ్గర ఉన్న కత్తితో పాపం పోనీలే అని బిచ్చం వేసిన షాపు యజమానిపైనే దాడితో దాడికి ప్రయత్నించాడు. ఈ ఘటన చూసి షాక్ అయిన షాపు యజమాని బిచ్చగాడితో గొడవకు దిగాడు.

ఈ ఘటన చూసిన మిగతా షాపు యజమానులు బిచ్చగాడికి పట్టుకున్నారు. ఇచ్చింది తీసుకో లేకపోతే వెళ్లిపో అంతేకానీ కత్తితో దాడి చేస్తావా అంటూ వాడిని పట్టుకున్నారు. పోలీసులకు సమాచారం ఇచ్చారు. వాళ్లు వచ్చి బిచ్చగాడికి పోలీస్ స్టేషన్ కు తరలించారు. షాపు యజమాని శ్రీనివాస్ కంప్లయింట్ ఆధారంగా విచారణ చేస్తున్నారు పోలీసులు. 

బిచ్చగాడు బిచ్చగాడిగా ఉన్నాడా ఏంటీ.. అడుక్కోవటానికి వచ్చినోడు బిచ్చం సరిపోలేదని కత్తితో దాడి చేయటం ఏంటీ అంటూ షాపు యజమానుల్లో చర్చ నడుస్తుంది. ఇటీవల కాలంలో బిచ్చగాళ్లలో విపరీత ప్రవర్తన కనిపిస్తుందని.. తిండి వద్దు డబ్బులే కావాలంటూ డిమాండ్ చేస్తున్నారంటూ చెప్పుకొస్తున్నారు వ్యాపారులు.