V6 News

చైనా BYDకి Vs వియత్నాం విన్‌ఫాస్ట్ EV కారు : మిడిల్‌క్లాస్ ఫ్యామిలీ టార్గెట్‌గా మోడల్స్, ధరలు

చైనా BYDకి  Vs వియత్నాం విన్‌ఫాస్ట్ EV కారు : మిడిల్‌క్లాస్ ఫ్యామిలీ టార్గెట్‌గా మోడల్స్, ధరలు

భారత ఈవీ మార్కెట్లోకి వియత్నాం కార్ల తయారీ సంస్థ విన్‌ఫాస్ట్ తన మూడవ ఆయుధాన్ని తీసుకొచ్చేసింది. ఎలక్ట్రిక్ కార్లకు ఇండియాలో క్రేజ్ పెరుగుతున్న వేళ BYD, కియా లాంటి కంపెనీల కార్లను టార్గెట్ చేస్తూ ఇండియన్ మిడిల్ క్లాస్ కోసం ఎంపీవీని విడుదల చేసింది. బ్యాటెరీపై వారెంటీ, రేంజ్ నుంచి ఉచిత ఛార్జింగ్ వరకూ ఇందిస్తున్న ప్రయోజనాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.. 

 మేడ్-ఫర్-ఇండియా వ్యూహంలో భాగంగా VF 6, VF 7 ఎస్‌యూవీల తర్వాత.. విన్‌ఫాస్ట్ ఇప్పుడు ఫ్యామిలీ ఆడియన్స్ టార్గెట్ చేస్తూ.. VF MPV 7 ఎలక్ట్రిక్ ఎంపీవీని ఇండియన్ మార్కెట్లో విడుదల చేసింది. దీని ఎక్స్-షోరూమ్ ప్రారంభ ధర రూ. 24 లక్షల 49వేలుగా కంపెనీ నిర్ణయించింది. తమిళనాడులోని తయారీ కేంద్రంలో అసెంబుల్ అవుతున్న ఈ కారు.. స్టైలిష్ డిజైన్, అదిరిపోయే రేంజ్‌తో మధ్యతరగతి, పెద్ద ఫ్యామిలీలను ఆకట్టుకునేలా సిద్ధం చేయబడింది. 

ALSO READ : టెక్ మహీంద్రాపైనా మత వివక్ష ఆరోపణలు

సాంకేతిక వివరాల్లోకి వెళ్తే.. ఈ ఎంపీవీలో 60.13kWh లిథియం-అయాన్ బ్యాటరీని కంపెనీ అందిస్తోంది. ఇది ఒక్కసారి ఛార్జ్ చేస్తే ఏకంగా 517 కిలోమీటర్ల రేంజ్ ఇస్తుంది. 150kW పవర్, 280Nm టార్క్ ఉత్పత్తి చేసే దీని మోటార్.. కేవలం 10 సెకన్లలోనే 0 నుండి 100 కి.మీ వేగాన్ని అందుకుంటుంది. ఇక ఛార్జింగ్ విషయానికొస్తే.. 80kW DC ఫాస్ట్ ఛార్జర్ సాయంతో కేవలం 30 నిమిషాల్లోనే 10 శాతం నుంచి 70శాతం వరకు ఛార్జింగ్ చేయెుచ్చు. హైవే ప్రయాణాలకు ఈ రేంజ్, ఛార్జింగ్ స్పీడ్ పెద్ద ప్లస్ పాయింట్ అంటున్నారు ఆటో లవర్స్.

డిజైన్ పరంగా విన్‌ఫాస్ట్ తన సిగ్నేచర్ V-షేప్ LED లైటింగ్, 19-అంగుళాల భారీ అలాయ్ వీల్స్‌తో ప్రీమియం లుక్ ఇచ్చింది. లోపల 10.1-అంగుళాల ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, వివి వర్చువల్ అసిస్టెంట్, క్యాంప్ మోడ్ వంటి ఫీచర్లు ఉన్నాయి. ముఖ్యంగా త్రీ-రో థియేటర్ స్టైల్ సీటింగ్ వల్ల పెద్దవారు కూడా మూడవ వరుసలో సౌకర్యవంతంగా కూర్చోవచ్చు. సేఫ్టీ విషయంలో వెనకాడకుండా 4 ఎయిర్‌బ్యాగ్‌లు, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, ఆల్-డిస్క్ బ్రేక్స్‌ను ఇందులో అందిస్తోంది కంపెనీ.

ALSO READ : నెక్సా కార్లపై మారుతీ సుజుకీ అదిరిపోయే ఆఫర్లు..

కస్టమర్ల నమ్మకాన్ని గెలుచుకునేందుకు విన్‌ఫాస్ట్ కళ్లు చెదిరే వారెంటీ ప్యాకేజీని ప్రకటించింది. బ్యాటరీపై 10 ఏళ్లు, కారుపై 7 ఏళ్లు, ఈవీ పెయింట్‌పై 7 ఏళ్లు, 3 ఏళ్ల ఉచిత మెయింటెనెన్స్‌ను ఆఫర్ చేస్తోంది. మార్కెట్లోని BYD eMax 7.. త్వరలో రాబోయే కియా క్యారెన్స్ క్లావిస్ EVలకు ఇది గట్టి పోటీనివ్వనుంది. 2029 వరకు ఉచిత ఛార్జింగ్ సౌకర్యాన్ని అందిస్తుండటం ఈ కారు కొనేవారికి అదనపు లాభం అనే చెప్పుకోవాలి.