ఇండియన్ మిడిల్ క్లాస్ నుంచి భారీగా ప్రజాధరణ పొందిన ఆటో సంస్థ మారుతీ సుజుకీ. తాజాగా కంపెనీ కార్ లవర్స్ కి పండగ లాంటి వార్త ఒకటి ప్రకటించింది. 2026 ఆర్థిక సంవత్సరంలో రికార్డు స్థాయిలో 18 లక్షలకు పైగా వాహనాలను విక్రయించి ఘనవిజయాన్ని అందుకున్న మారుతీ సుజుకీ.. అదే జోష్‌తో ఏప్రిల్ నెలలో తన కస్టమర్ల కోసం భారీ డిస్కౌంట్లను ఆఫర్ చేస్తోంది. ప్రీమియం సెగ్మెంట్ అయిన నెక్సా మోడల్ కార్లపై ఏకంగా రూ.2లక్షల15వేల వరకు ప్రయోజనాలను కల్పిస్తూ వాహనదారులను ఆకర్షిస్తోంది.
మారుతీ సుజుకీ ప్రస్తుతం నెక్సా, అరేనా అనే రెండు వేర్వేరు ఛానళ్ల ద్వారా కార్లను ఇండియాలో అమ్ముతున్న సంగతి తెలిసిందే. నెక్సాలో విక్రయించే ప్రీమియం కార్లపై ఈ నెలలో అందిస్తున్న తగ్గింపుల వివరాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
1. మారుతీ సుజుకీ ఇన్విక్టో: ఈ నెలలో అత్యధికంగా రూ.2లక్షల15వేల వరకు తగ్గింపు ఆఫర్లు లభిస్తున్నాయి.
2. మారుతీ సుజుకీ గ్రాండ్ విటారా: ఈ పాపులర్ ఎస్‌యూవీపై రూ.లక్షా 7వేల వరకు తగ్గింపు పొందవచ్చు.
3. మారుతీ సుజుకీ ఫ్రాంక్స్: స్టైలిష్ ఎస్‌యూవీగా పేరుగాంచిన దీనిపై రూ.55వేల వరకు ప్రయోజనాలు ఉన్నాయి.
4. మారుతీ సుజుకీ ఇగ్నిస్: ఈ కాంపాక్ట్ కారుపై రూ.50వేల వరకు ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి.
5. మారుతీ సుజుకీ జిమ్నీ: ఆఫ్‌రోడ్ ప్రియుల ఇష్టపడే ఈ కారుపై రూ.50వేల వరకు తగ్గింపు లభిస్తుంది.
6. మారుతీ సుజుకీ XL6: ఫ్యామిలీ ఎంపీవీపై కూడా రూ.50వేల వరకు రాయితీ ఇస్తున్నారు.
7. మారుతీ సుజుకీ బాలెనో: దేశంలో అత్యధికంగా అమ్ముడయ్యే ఈ హ్యాచ్‌బ్యాక్‌పై రూ.40వేల వరకు బెనిఫిట్స్ ఉన్నాయి.
ఈ ఆఫర్లలో కేవలం క్యాష్ డిస్కౌంట్స్ మాత్రమే కాకుండా ఎక్స్ఛేంజ్ బోనస్, స్క్రాపేజ్ బోనస్, కార్పొరేట్ డిస్కౌంట్లు, లాయల్టీ బోనస్‌లు కూడా కలిసి ఉన్నాయి. అయితే ఈ తగ్గింపులు కారు వేరియంట్‌ను బట్టి, డీలర్‌ను బట్టి మారే అవకాశం ఉంటుంది. కేవలం నెక్సా మాత్రమే కాకుండా.. అరేనా షోరూమ్‌లలో లభించే ఆల్టో K10, స్విఫ్ట్, బ్రెజ్జా వంటి మోడళ్లపై కూడా రూ.45వేలు వరకు ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. కొత్త కారు కొనాలని ప్లాన్ చేస్తున్న వారికి ఏప్రిల్ నెల ఒక మంచి అవకాశంగా చెప్పవచ్చు. ఈ ఆఫర్లు ఈ నెలాఖరు వరకు మాత్రమేనని కంపెనీ ప్రకటించింది.

