కోల్ కతా బ్యాటింగ్ పై నాటి హీరోయిన్ అనుచిత కామెంట్స్

కోల్ కతా బ్యాటింగ్ పై నాటి హీరోయిన్ అనుచిత కామెంట్స్

గ్యాంగ్ వార్, నిప్పురవ్వ, గాడ్ ఫాదర్, అన్నమయ్య వంటి చిత్రాలతో తెలుగువారికి కస్తూరి పరిచయమే. మధ్యలో కొన్నాళ్లు కనిపించకపోయినా, మళ్లీ ఎంట్రీ ఇచ్చి డాన్ శీను, శమంతకమణి వంటిచిత్రాల్లో మెరిసింది. సినిమాల సంగతి అలా ఉంచితే రీఎంట్రీ తర్వాత చాలా సమస్యల్లో ఇరుక్కుంటోంది కస్తూరి. ఆ మధ్య తనకు సంబంధంలేని ఒక విషయం గురించి కామెంట్ చేసి విమర్శల పాలయ్యింది. ఇప్పుడు కోల్‌ కతా,చెన్నై ఐపీఎల్‌ మ్యాచ్ సందర్భంగా ఆమె చేసిన వ్యాఖ్యలు మరో కొత్త వివాదాన్ని సృష్టించాయి. కోల్‌ కతా బ్యాటింగ్ మందకొడిగా ఉండటంతో ‘వీళ్ల బ్యాటిం గ్ చూస్తే‘ పళ్లాండు వాళ్గ’ చిత్రంలో లతను ఎంజీఆర్ తడిమినట్టుగానే ఉంది’ అని కామెంట్ చేసింది కస్తూరి. దాంతో ఎంజీఆర్‌‌‌‌ అభిమానులందరూ చివ్వున లేచారు. చివరికి నటి లతకూడా చాలా సీరియస్ అయ్యారు. ‘యాభయ్యేళ్లుగా ఇండస్ట్రీలో ఉన్నాను. ఎంతో గౌరవాన్ని సంపాదించుకున్నాను. నా గురించి కామెంట్ చేసే స్థాయి తనకి లేదు. పైగా ఆ సినిమాని, ఎంజీఆర్‌‌‌‌ని నేటికీ అందరూ ఇష్టపడతారు. అంతగా ఉదాహరణ చెప్పాలంటే తన సినిమా గురించి చెప్పుకోవాల్సింది. ఆమెకంటే దారుణంగా నేనెప్పుడూ నటించలేదు కదా’ అంటూ ఆవేశంగా స్పందించారామె. లత అలా అనడంలో తప్పు లేదని, కస్తూరి కాస్త మాట్లాడటం నేర్చుకోవాలని అందరూ అంటున్నారు. మరి కస్తూరి దీనికెలా రియాక్టవుతుందో.