హైదరాబాద్, వెలుగు: బౌల్డర్స్ క్లాసిక్ గోల్ఫ్ టోర్నమెంట్‌లో ఇండియా స్టార్ గోల్ఫర్ శుభంకర్ శర్మ చాంపియన్‌గా నిలిచాడు. హైదరాబాద్‌లోని బౌల్డర్ హిల్స్ గోల్ఫ్ కంట్రీ క్లబ్‌లో శుక్రవారం ముగిసిన ఈ మెగా ఈవెంట్‌లో 5 -అండర్ 67 స్కోరుతో విజయం సాధించి తన ఏడో డీపీ వరల్డ్ పీజీటీఐ టైటిల్‌ను కైవసం చేసుకున్నాడు.
చండీగఢ్‌కు చెందిన 29 ఏండ్ల శుభంకర్ పీజీటీఐలో అత్యల్ప అగ్రిగేట్ స్కోరు( 25 అండర్ 263)తో సరికొత్త రికార్డు సృష్టించాడు. ఈ విజయంతో అతనికి రూ. 15 లక్షల బహుమతి లభించింది. హైదరాబాద్ గోల్ఫర్ మొహమ్మద్ అజర్, రషీద్ ఖాన్ (ఢిల్లీ), అంగద్ చీమా (చండీగఢ్)తో కలిసి జాయింట్ రన్నరప్‌గా నిలిచాడు.

