V6 News

చేతబడి నేపథ్యంలో..జేడీ చక్రవర్తి సినిమా..

చేతబడి నేపథ్యంలో..జేడీ చక్రవర్తి సినిమా..

జేడీ చక్రవర్తి  లీడ్ రోల్‌‌‌‌‌‌‌‌లో ఓ హారర్ థ్రిల్లర్ రాబోతోంది.  శుక్రవారం ఈ మూవీకి ‘చేతబడి’ అనే టైటిల్‌‌‌‌ను ఫైనల్‌‌‌‌ చేస్తూ ప్రీ లుక్ పోస్టర్‌‌‌‌‌‌‌‌ను విడుదల చేశారు.. సూర్యాస్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని మహేంద్రనాథ్‌‌‌‌ కూండ్ల నిర్మిస్తున్నారు.  అచ్చు రాజమణి సంగీతం  అందిస్తుండగా చంద్రబోస్ లిరిక్స్ రాస్తున్నారు. 

రియల్ ఇన్సిడెంట్స్ ఆధారంగా  బాణామతి బ్యాక్ డ్రాప్‌‌‌‌లో రూపొందుతున్న ఈ చిత్రంలో హీరోగా, విలన్‌‌‌‌గా  డిఫరెంట్ గెటప్‌‌‌‌లో జేడీ చక్రవర్తి కనిపించనున్నారు. వచ్చే నెలనుంచి రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ కానుంది. షూటింగ్‌‌‌‌కు ముందే  ఐదు భాషల ఆడియో రైట్స్‌‌‌‌ను సరిగమ సంస్థ దక్కించుకుంది.