V6 News

వచ్చే ఏడాది జనవరిలో లవ్ అండ్ వార్‌‌‌‌‌‌‌‌ రిలీజ్...

వచ్చే ఏడాది జనవరిలో లవ్ అండ్ వార్‌‌‌‌‌‌‌‌ రిలీజ్...

రియ‌‌‌‌ల్ లైఫ్ క‌‌‌‌పుల్ ర‌‌‌‌ణ‌‌‌‌బీర్ కపూర్, అలియా భ‌‌‌‌ట్ జంటగా నటిస్తున్న చిత్రం ‘లవ్ అండ్ వార్‌‌‌‌‌‌‌‌’. విక్కీ కౌశల్ కీలకపాత్ర పోషిస్తున్నాడు. సంజయ్ లీలా భన్సాలీ తెరకెక్కిస్తున్నారు. శుక్రవారం ఈ మూవీ రిలీజ్ డేట్‌‌‌‌ను ప్రకటించారు. వచ్చే ఏడాది జనవరి 21న   విడుదల చేయబోతున్నట్టు తెలియజేశారు. ఇందులో రణబీర్‌‌‌‌‌‌‌‌, విక్కీ కౌశల్ ఎయిర్‌‌‌‌‌‌‌‌ ఫోర్స్‌‌‌‌ ఆఫీసర్స్‌‌‌‌గా నటిస్తున్నారు. క్లోజ్  ఫ్రెండ్స్ అయిన వీళ్లిద్దరి మధ్య ఓ అమ్మాయి కారణంగా విభేదాలు రావడం.. తమ లవ్ కోసం వీళ్లిద్దరూ ఎలాంటి వార్‌‌‌‌‌‌‌‌ చేశారనే కాన్సెప్ట్‌‌‌‌తో తెరకెక్కిస్తున్నారు.

హిందీతో పాటు తెలుగులోనూ విడుదల చేయబోతున్నారు.  నిజానికి ఇది ఈ ఏడాది సమ్మర్‌‌‌‌‌‌‌‌లో రిలీజ్‌‌‌‌ కావల్సి ఉంది. అయితే రణబీర్ కపూర్ ‘రామాయణ’లో నటిస్తుండగా, విక్కీ కౌశల్ ‘మహావతార్‌‌‌‌‌‌‌‌’లో నటిస్తున్నాడు. 

ఈ ఇద్దరు హీరోల డేట్స్‌‌‌‌ అడ్జస్ట్ కాకపోవడం వల్లే ఆలస్యమైందనే ప్రచారం జరుగుతోంది. అంతేకాదు స్క్రిప్ట్‌‌‌‌లో భన్సాలీ చేసిన మార్పులు కూడా కారణమనే కామెంట్స్‌‌‌‌ వినిపిస్తున్నాయి. ఇక ‘బ్రహ్మాస్ర్త’ తర్వాత రణబీర్‌‌‌‌‌‌‌‌ కపూర్, అలియా భట్ కాంబినేషన్‌‌‌‌లో వస్తున్న సినిమా ఇది.