ప్రిన్స్, సాంచి కశ్యప జంటగా నజీం ఎస్ రూపొందిస్తున్న చిత్రం ‘అటు ఫ్రెండ్ ఇటు లవర్’. రీసెంట్‌గా ఈ మూవీ ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌ను నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రిన్స్ మాట్లాడుతూ ‘టీమ్ అందరి సపోర్ట్‌తో షూటింగ్ పూర్తిచేశాం. తెలుగు ఆడియెన్స్ మంచి చిత్రాల్ని ఎప్పుడూ ఆదరిస్తూనే ఉంటారు. మా చిత్రాన్ని కూడా ఆదరిస్తారనే నమ్మకం ఉంది’ అని అన్నాడు.
ఈ సినిమాలో నటించడం ఆనందంగా ఉందని సాంచి కశ్యప చెప్పింది. డైరెక్టర్ నజీం ఎస్ మాట్లాడుతూ ‘ప్రిన్స్, సాంచి ఎంతో సపోర్ట్ చేశారు. కొత్త దర్శకుడని చూడకుండా ప్రతి విషయంలో బ్యాక్ బోన్‌లా నిలిచారు. ఈ మూవీకి పని చేసిన ప్రతి ఒక్కరికీ థాంక్స్’ అని చెప్పాడు.

