షెరాజ్ మెహదీ హీరోగా నటిస్తూ, రూపొందించిన చిత్రం ‘ఓ అందాల రాక్షసి’. విహాన్షి హెగ్డే హీరోయిన్‌గా నటించింది. లాస్ట్ ఇయర్ విడుదలైన ఈ చిత్రాన్ని ఏప్రిల్ 24న రీ రిలీజ్ చేయనున్నట్టు ప్రకటించారు. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో షెరాజ్ మెహదీ మాట్లాడుతూ ‘ఇదొక ఉమెన్ ఓరియెంటెడ్ మూవీ. అమ్మాయిలకు మోసాలు జరగకూడదనే ఉద్దేశంతో తీసిన చిత్రమిది.
సమాజంలో అమాయక మహిళలు ఎలా మోసపోతున్నారో చూపించడంతో పాటు, అలాంటి మోసాలకు పాల్పడేవారికి తగిన శిక్ష తప్పదనే సందేశాన్ని కూడా అందిస్తున్నాం. గతంలో ఈ సినిమాను మిస్ అయిన వారు, మళ్లీ చూడాలనుకునే వారు రీ-రిలీజ్ సందర్భంగా థియేటర్లకు వచ్చి చూడాలని కోరుతున్నా’ అన్నాడు. కృతి వర్మ మరో హీరోయిన్‌గా నటించగా, నేహా దేశపాండే, తమ్మారెడ్డి భరద్వాజ, సుమన్, అనంత్ బాబు, ప్రియా ఇతర పాత్రలు పోషించారు.

