V6 News

నిరుద్యోగులకు గుడ్ న్యూస్: RBIలో జూనియర్ ఇంజినీర్ పోస్టులు.. కొద్దిరోజులే ఛాన్స్..

నిరుద్యోగులకు గుడ్ న్యూస్: RBIలో జూనియర్ ఇంజినీర్ పోస్టులు.. కొద్దిరోజులే ఛాన్స్..

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్​బీఐ) జూనియర్ ఇంజినీర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. డిప్లొమా, బీఈ/ బి.టెక్ అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్‌లైన్ దరఖాస్తుల స్వీకరణ ఏప్రిల్ 16న ప్రారంభమై మే 5న ముగుస్తుంది.

పోస్టు పేరు: జూనియర్ ఇంజినీర్. 

మొత్తం ఖాళీలు: 11.

విభాగాల వారీగా ఖాళీలు: సివిల్ 7, ఎలక్ట్రికల్ 4. 

ఎలిజిబిలిటీ: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి సంబంధిత ఇంజినీరింగ్ విభాగంలో కనీసం 65 శాతం మార్కులతో 3 సంవత్సరాల డిప్లొమా (ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీలకు 55 శాతం)లేదా సంబంధిత ఇంజినీరింగ్ విభాగంలో కనీసం 55 శాతం మార్కులతో డిగ్రీ  (ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీలకు 55 శాతం) పూర్తిచేసి ఉండాలి.  నిర్దేశించిన పోస్ట్- క్వాలిఫికేషన్ కలిగి ఉండాలి. 

వయోపరిమితి: 20 నుంచి 30 ఏండ్లు ఉండాలి. కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం రిజర్వ్డ్ వర్గాలకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది. 

అప్లికేషన్: ఆన్​లైన్ ద్వారా.

అప్లికేషన్ ప్రారంభం: ఏప్రిల్ 16.

అప్లికేషన్ ఫీజు: ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ, మాజీ సైనికులకు రూ.50. ఓబీసీ, జనరల్, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు రూ.450.

లాస్ట్ డేట్: మే 06. 

ఆన్​లైన్ ఎగ్జామ్ తేదీ: 2026, జూన్ 6 (తాత్కాలికం). 

సెలెక్షన్ ప్రాసెస్: ఆన్​లైన్ ఎగ్జామినేషన్, లాంగ్వేజీ ప్రొఫిషియెన్సీ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా  అభ్యర్థులను ఎంపిక చేస్తారు. 

మరిన్ని వివరాలకు వెబ్ సైట్ www.rbi.org.inను సందర్శించండి. 

ఆన్‌లైన్ పరీక్షా విధానం 
ఈ పరీక్ష పూర్తిగా ఆబ్జెక్టివ్ తరహాలో ఉంటుంది. మొత్తం 300 ప్రశ్నలు ఉంటాయి. ఒక్కో ప్రశ్నకు ఒక మార్కు చొప్పున మొత్తం 300 మార్కులు కేటాయించారు. ప్రశ్నలు ఇంగ్లిష్ లాంగ్వేజ్, ఇంజినీరింగ్ విభాగం, జనరల్ ఇంటెలిజెన్స్, రీజనింగ్ నుంచి ప్రశ్నలు ఉంటాయి. 

►ALSO READ | CSIR-NIScPRలో 40 ఉద్యోగాలు: పరీక్ష లేదు.. ఫీజు లేదు.. కేవలం ఇంటర్వ్యూతోనే ఎంపిక!