V6 News

CSIR-NIScPRలో 40 ఉద్యోగాలు: పరీక్ష లేదు.. ఫీజు లేదు.. కేవలం ఇంటర్వ్యూతోనే ఎంపిక!

CSIR-NIScPRలో 40 ఉద్యోగాలు: పరీక్ష లేదు.. ఫీజు లేదు.. కేవలం ఇంటర్వ్యూతోనే ఎంపిక!

నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ కమ్యూనికేషన్ అండ్ పాలసీ రీసెర్చ్ (CSIR NIS CPR) ప్రాజెక్ట్ అసోసియేట్, ప్రాజెక్ట్ సైంటిస్ట్, ఇతర పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. 

మొత్తం ఖాళీలు: 40.

విభాగాల వారీగా ఖాళీలు: ప్రాజెక్ట్ అసోసియేట్–I 14, ప్రాజెక్ట్ అసోసియేట్–II 18, ప్రాజెక్ట్ అసిస్టెంట్–II  01, సీనియర్ ప్రాజెక్ట్ అసోసియేట్ 05, ప్రిన్సిపల్ ప్రాజెక్ట్ అసోసియేట్ 01, ప్రాజెక్ట్ సైంటిస్ట్ –II 01.

ఎలిజిబిలిటీ: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి సంబంధిత విభాగంలో బీఈ/ బి.టెక్, ఎంఈ/ ఎం.టెక్, ఎంఎస్సీ, ఎంసీఏ, పీహెచ్​డీ పూర్తిచేసి ఉండాలి. 

గరిష్ట వయోపరిమితి: 40 ఏండ్లు. కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం రిజర్వ్డ్ వర్గాలకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది. 

అప్లికేషన్: ఆన్​లైన్ ద్వారా. 

ఎలాంటి అప్లికేషన్ ఫీజు లేదు. 

వాక్ ఇన్ ఇంటర్వ్యూ: మే 14. 

సెలెక్షన్ ప్రాసెస్: డాక్యుమెంట్ వెరిఫికేషన్, పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. 

మరిన్ని వివరాలకు వెబ్‌సైట్ niscpr.res.in ను సందర్శించండి.