డ్రగ్స్ కేసులో ఓ ప్రముఖ కొరియోగ్రాఫర్ కూడా ఉన్నారని డీసీపీ శ్రీనివాస్ తెలిపారు. హైదర్షాకోటీలో రైడ్ చేసి ఐదుగురిని అరెస్టు చేశామన్నారు. డ్రగ్స్ గ్యాంక్ కు కీలక సూత్ర దారి ఏకుబా సుజి అని తెలిపారు. ఏబుకపై రూ. 2 లక్షల రివార్డ్ ఉందని తెలిపారు. ప్రస్తుతం ఏకుబా పరారీలో ఉన్నారని తెలిపారు. డ్రగ్స్ ను నైజీరియా లేడీ అనోహా తెచ్చిందని అనోహ 2019 నుంచి డ్రగ్స్ సప్లై చేస్తుందని అన్నారు. నైజీరియా టూ హైదరాబాద్ వయా ఢిల్లీగా డ్రగ్స్ దందా నడుస్తుందని చెప్పారు.
డ్రగ్స్ సప్లాయర్ లో ఓకొరియోగ్రాఫర్ కూడా ఉన్నారని చెప్పారు. ఐదుగుర్ని అరెస్టు చేశాం పరారిలో ఇంకో ఇద్దరు పరారీలో ఉన్నారని తెలిపారు. ఐదుగురి శాంపిల్స్ తీసుకున్నామని అందులో అమన్ సింగ్ కు పాజిటీవ్ వచ్చిందన్నారు. హీరోయిన్ రకుల్ ప్రీత్ సోదరుడు అమన్ సింగ్ డ్రగ్స్ తీసుకున్నాడని తెలిపారు. అమన్ సింగ్ కు పాజిటీవ్ గా తేలిందని అన్నారు. అమన్ సింగ్ ను వినయోగదారుడిగానే విచారిస్తున్నామని చెప్పారు.
2 పాస్ పోర్టులు, 10సెల్ఫోన్స్, 2 బైకులు స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. ఐదుగురు డ్రగ్స్ పెడ్లార్ నుండి 35 లక్షల విలువ చేసే 199 గ్రాముల కొకైన్ లభ్యమైందన్నారు. 6 నెలల్లో 30 మంది వీఐపీ కస్టమర్స్ కు కొకైన సరఫరా చేశారని విచారణలో తెలిసిందన్నారు డీసీపీ. నిందితుల వివరాలు, ఒనౌహా బ్లెస్సింగ్( వెస్ట్ ఆఫ్రికా), అజీజ్ నోహీం, అల్లం సత్య వెంకట గౌతం, సానబోయిన వరుణ్ కుమార్, మహ్మద్ మహబూబ్ షరీఫ్ లా మరికొందరు ఉన్నారని తెలిపారు.