
వెబ్ సిరీస్‌లతో జోరు పెంచిన తమన్నా రెండు భారీ సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇందులో రజనీకాంత్(Rajinikanth) తో నటించిన జైలర్(Jailer), రిలీజ్‌కు సిద్ధమైన భోళాశంకర్ ఉన్నాయి. తమన్నా(Tamannaah) వరుసగా సీనియర్ హీరోలతో జోడీ కట్టడంపై సోషల్ మీడియాలో ట్రోలింగ్ జరుగుతోంది.
ఈ హీరోయిన్ రెమ్యూనరేషన్‌కు ఆశపడి తనకు సెట్ అవ్వకపోయినా కొన్ని రోల్స్‌కు ఓకే చెప్పేస్తోందని ఓ వర్గం నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. దీనిపై ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తమన్నా స్పందించింది. తెరపై చూడాల్సింది రెండు పాత్రలను మాత్రమేనని తెలిపింది.
ఇద్దరు వ్యక్తుల మధ్య వయసు వ్యత్యాసం సినిమాల్లో నటించేందుకు అడ్డంకి కాదని.. తనకు సీనియర్ హీరోలతో పనిచేయడం ఇష్టమని తెలిపింది. హాలీవుడ్ నటుడు టామ్‌క్రూజ్ 60 ఏళ్ల వయసులోనూ స్టంట్స్ వేస్తున్నాడు. నేను కూడా ఆ వయసులో అంతే గ్రేస్‌తో డ్యాన్స్ చేయగలను అంటూ చెప్పుకొచ్చింది.