అక్కడ హైకోర్టు కాదు.. హై కోర్టు బెంచ్ 

అక్కడ హైకోర్టు కాదు.. హై కోర్టు బెంచ్ 

కర్నూలులోని కొండారెడ్డి బురుజు జనసంద్రంగా మారింది. కర్నూలు జిల్లాలో పాదయాత్ర చేస్తున్న తెలుగు దేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్‌ ఇక్కడ పర్యటిస్తున్నారు. 2024 ఎన్నికల్లో టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు లోకేశ్. యువగళం పాదయాత్ర 93వ రోజు కర్నూలులో సాగుతోంది. మే 8వ తేదీన ఎస్టీబీసీ గ్రౌండ్ గెస్ట్ హౌజ్ నుంచి పాదయాత్ర ప్రారంభమైంది. కర్నూలులోని జిల్లా కోర్టు భవనం వద్దకు పాదయాత్ర చేరుకోగా..  పలువురు న్యాయవాదులు ఆయనను కలిసి పాదయాత్రకు సంఘీభావం తెలిపారు. 

ఈ సందర్భంగా మాట్లాడిన నారా లోకేశ్.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మాదిరి తాము మాట మార్చమని, మడమ తిప్పే బ్యాచ్ కాదని అన్నారు. కర్నూలులో హైకోర్టు బెంచ్ కచ్చితంగా ఏర్పాటు చేస్తామని స్పష్టం చేశారు. టీడీపీ అధికారంలోకి రాగానే బెంచ్ ఏర్పాటు చేస్తామని తెలిపారు. కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేస్తామన్న లోకేశ్ హామీపై న్యాయవాదులు ఆయనకు ధన్యవాదాలు తెలిపారు.