బీఎల్ సంతోష్‌కి సిట్ ఇచ్చిన నోటీసులు రద్దు చేయలేం: హైకోర్ట్

బీఎల్ సంతోష్‌కి సిట్ ఇచ్చిన నోటీసులు రద్దు చేయలేం: హైకోర్ట్

సిట్, బీజేపీ దాఖలు చేసిన రెండు పిటిషన్లను హైకోర్ట్ విచారించింది. బీఎల్ సంతోష్, అడ్వొకేట్ శ్రీనివాస్ కు నోటీసులు జారీ చేయడాన్ని సవాల్ చేస్తూ బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రేమేందర్ రెడ్డి వేసిన పిటిషన్ ను హైకోర్టు తోసిపుచ్చింది. సిట్ నోటీసులను రద్దు చేయలేమన్న హైకోర్ట్.. బీఎల్ సంతోష్, శ్రీనివాస్ లకు 41ఏ సీఆర్పీసీ నోటీసులు ఇవ్వడం ఎలా లీక్ అయ్యిందని ప్రశ్నించింది.

సిట్ దర్యాప్తు గోప్యంగా ఉంచి.. పారదర్శకంగా జరగాలని హైకోర్ట్ సూచించింది. 41ఏ సీఆర్పీసీ లో అరెస్ట్ చెయ్యడానికి  వీళ్లేదని ఆదేశించిన హైకోర్టు..ఢిల్లీ పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించింది. తదుపరి ఆదేశాలు వచ్చే వరకు ఎలాంటి అరెస్ట్ చెయ్యడానికి వీళ్లేదని చెప్పింది. సిట్ దర్యాప్తుకు బీఎల్ సంతోష్ సహకరించాలని హైకోర్టు ఆదేశించింది.  సిట్ అధికారులు ఢిల్లీ పోలీసులకు 41 ఏ నోటీసులివ్వాలని ఆదేశించిన కోర్టు.. తదుపరి విచారణను మంగళవారానికి వాయిదా వేసింది.

ఫాంహౌస్ కేసులో హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ నేతృత్వంలోనే సిట్ పలువురికి నోటీసులు జారీ చేసింది. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్, కరీంనగర్‌కు చెందిన న్యాయవాది శ్రీనివాస్‌లకు సిట్ నోటీసులు జారీ చేసింది. హైదరాబాద్‌లోని పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్‌లోని కార్యాలయంలో నవంబర్ 21న ఉదయం 10.30 గంటలకు సిట్ ఎదుట హాజరుకావాలని 41ఏ సీఆర్పీసీ నోటీసులు ఇచ్చింది. అయితే కుట్రలో భాగంగానే వారికి 41ఏ కింద నోటీసులు ఇచ్చారని బీజేపీ ఆరోపిస్తూ కోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖల