జూబ్లీహిల్స్ హౌసింగ్ సొసైటీకి స్పెషల్ ఆఫీసర్

జూబ్లీహిల్స్ హౌసింగ్ సొసైటీకి స్పెషల్ ఆఫీసర్

జూబ్లీహిల్స్ హౌసింగ్ సొసైటీ సొసైటీకి స్పెషల్ ఆఫీసర్ ను నియమించాలని ఆదేశించింది  తెలంగాణ హైకోర్టు. జూబ్లీహిల్స్‌ కో ఆపరేటివ్‌ హౌస్‌ బిల్డింగ్‌ సొసైటీలో వ్యవహారాలు అదుపుతప్పి  జరుగుతున్నందున సొసైటీ పర్యవేక్షణకు, నియంత్రణకు స్పెషల్‌ ఆఫీసర్‌ను నియమించాలని  ఆదేశించింది. తెలంగాణా కో ఆపరేటివ్‌ సొసైటీల రిజిస్ట్రార్‌-కమ్‌-కమిషనర్‌ను ఆదేశించింది..  జూబ్లీహిల్స్‌ హౌసింగ్‌ సొసైటీ కార్యదర్శి ఎ.మురళీముకుంద్‌ స్పెషలాఫీసర్‌ నియామకం కోరుతూ పిటిషన్‌ వేయడంతో హైకోర్టు ఈ మధ్యంతర ఆదేశాలు ఇచ్చింది.

అదే విధంగా సెక్రటరీ అధికారాలను తొలగిస్తూ సొసైటీ ప్రెసిడెంట్ రవీంద్రనాథ్ ఈ నెల 12 న జారీ చేసిన నోటీసును సస్పెండ్ చేసింది హైకోర్టు. అలాగే  సొసైటీ సెక్రటరీగా తన విధులను తాను నిర్వర్తించకుండా సొసైటీ ప్రెసిడెంట్‌ బొల్లినేని రవీంద్రనాథ్‌, ఇతర పాలకవర్గ సభ్యులు అడ్డుపడుతున్నారంటూ సొసైటీ సెక్రటరీ మురళీముకుంద్‌ వేసిన పిటిషన్‌పై సొసైటీ ప్రెసిడెంట్ కు నోటీసులు జారీచేసింది  హైకోర్టు.