హైదరాబాద్, వెలుగు: భూ యాజమాన్య హక్కులకు చెందిన సివిల్ వివాదంలో పోలీసుల జోక్యం కేసులో రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు ఇచ్చింది. భూ హక్కులను నిర్ణయించడానికి పోలీసులకు అధికారం ఎక్కడిదో చెప్పాలంది. శామీర్‌పేట ఎస్‌హెచ్‌ఓ, ఎస్సైలు సివిల్ వివాదంలో జోక్యం చేసుకున్నారంటూ మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా శామీర్‌పేట మండలం తూంకుంటకు చెందిన మెండు అనిల్‌కుమార్ పిటిషన్ వేశారు.
దీనిని శుక్రవారం జస్టిస్ ఎన్.వి.శ్రవణ్‌కుమార్ విచారించి ప్రభుత్వానికి నోటీసులు ఇచ్చారు. డాక్యుమెంట్‌ను పరిశీలించి, హక్కులను పోలీసులు ఎలా నిర్ణయిస్తారని ప్రశ్నించారు. కౌంటరు దాఖలు చేయాలని హోంశాఖ ముఖ్యకార్యదర్శి, నగర పోలీసు కమిషనర్, శామీర్‌పేట ఎస్‌హెచ్‌ఓ, ఎస్సై, ప్రైవేటు వ్యక్తి ఎం.వెంకటరెడ్డికి నోటీసులు ఇచ్చింది. విచారణను కోర్టు ఈ నెల 19కి వాయిదా వేసింది.

