ఎంఎన్​సీని ఆదేశించిన హైకోర్టు

ఎంఎన్​సీని ఆదేశించిన హైకోర్టు

హైదరాబాద్, వెలుగు: ట్రాన్స్‌‌‌‌జెండర్లకు రిజర్వేషన్​ప్రకారం నీట్‌‌‌‌ పీజీ సీటును కేటాయించేలా చూడాలని నేషనల్‌‌‌‌ మెడికల్‌‌‌‌ కమిషన్‌‌‌‌(ఎన్‌‌‌‌ఎంసీ)ను హైకోర్టు ఆదేశించింది. పిటిషనర్‌‌‌‌ కోరిన కేటగిరీలో సీటు రాని పక్షంలో మెరిట్‌‌‌‌ ఆధారంగా ఏ కేటగిరీలో సీటు వస్తుందో చెప్పాలని ఉన్నత న్యాయస్థానం సూచించింది. ట్రాన్స్‌‌‌‌జెండర్లకు రిజర్వేషన్లు కల్పించాలని మూడేండ్ల  క్రితమే సుప్రీంకోర్టు ఆదేశించినా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోకపోవడంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎన్‌‌‌‌ఎంసీ నిర్దేశిస్తే రిజర్వేషన్లు కల్పించడానికి సిద్ధంగా ఉన్నామని రాష్ట్ర ప్రభుత్వం చెప్పడం సరికాదని పేర్కొంది. కాగా,  ట్రాన్స్‌‌‌‌జెండర్లకు రిజర్వేషన్‌‌‌‌ కల్పించాలని సుప్రీంకోర్టు గతంలో  ఆదేశించింది.  

అయితే జాతీయ మెడికల్​ కమిషన్‌‌‌‌ జారీ చేసిన నీట్‌‌‌‌ పీజీ కౌన్సెలింగ్‌‌‌‌ నోటిఫికేషన్‌‌‌‌లో ఆ ఆంశాన్ని పేర్కొనలేదని హైదరాబాద్‌‌‌‌కు చెందిన రూత్‌‌‌‌ జాన్‌‌‌‌ పాల్‌‌‌‌ హైకోర్టులో రిట్‌‌‌‌ దాఖలు చేశారు. దీనిపై మంగళవారం చీఫ్‌‌‌‌ జస్టిస్‌‌‌‌ ఉజ్జల్‌‌‌‌ భూయాన్, జస్టిస్‌‌‌‌ తుకారాంజీ ధర్మాసనం విచారణ చేపట్టింది. పిటిషనర్‌‌‌‌కు ఏదైనా ఇబ్బంది ఎదురైతే మళ్లీ కోర్టును ఆశ్రయించవచ్చని సూచించింది.