V6 News

షేక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పేట భూవివాదంలో సివిల్ కోర్టు తీర్పు సబబే : హైకోర్టు

షేక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పేట భూవివాదంలో సివిల్ కోర్టు తీర్పు సబబే : హైకోర్టు
  •     దీన్ని ఎండోమెంట్ ట్రిబ్యునల్‌‌‌‌‌‌‌‌లో  తేల్చుకోండి: హైకోర్టు

హైదరాబాద్, వెలుగు: హైదరాబాద్ గోల్కొండ మండలం షేక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పేటలోని సర్వే నెం. 139, 140లలో ఉన్న 3.13 ఎకరాల్లోని హనుమాన్ ఆలయ వివాదంపై హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. ఈ భూమి దేవాదాయ శాఖకు చెందుతుందని గతంలో సివిల్ కోర్టు ఇచ్చిన తీర్పును సమర్థించింది. సాంకేతిక కారణాల దృష్ట్యా బాధితులు దేవాదాయ ట్రైబ్యునల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను ఆశ్రయించాలని స్పష్టం చేసింది. 

షేక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పేటలోని 3.13 ఎకరాల భూమి, హనుమాన్ ఆలయం తమ పూర్వీకుల ఆస్తి అని, వీలునామా ప్రకారం తమకే హక్కులు ఉన్నాయని పేర్కొంటూ సత్యనారాయణ అగర్వాల్ అనే వ్యక్తి హైకోర్టులో పిటిషన్ వేశారు. ఈ భూమి దేవాదాయ శాఖకు చెందుతుందని సివిల్ కోర్టు ఇటీవల ఇచ్చిన తీర్పును రద్దు చేయాలని కోరారు. దీన్ని జస్టిస్ కె. లక్ష్మణ్, జస్టిస్ వాకిటి రామకృష్ణ ప్రసాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లతో కూడిన ధర్మాసనం శనివారం విచారించింది.