స్వచ్ఛమైన ప్రేమకు.. ముచ్చటైన బహుమతి

స్వచ్ఛమైన ప్రేమకు.. ముచ్చటైన బహుమతి

హైదరాబాద్, వెలుగు:  ప్రేమను వ్యక్తపరిచేందుకు ఉన్న ఓ రోజు ‘వాలంటైన్స్​ డే’. గ్రేటర్​లో వాలంటైన్స్ డే ను  ప్రేమికులూ,  పెళ్లయినవాళ్లూ ఎంతో స్పెషల్​గా సెలబ్రేట్ చేసుకునేందుకు ప్లాన్స్ చేసుకుంటారు. ప్రస్తుతం సర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ప్రైజ్ సెలబ్రేషన్స్ ట్రెండ్ నడుస్తోంది.  ‘కస్టమైజ్డ్ గిఫ్టింగ్’ పేరుతో.. మర్చిపోలేని  గుర్తులతో గిఫ్ట్స్ ని  తయారు చేయించి  అందిస్తున్నారు.  ప్రస్తుతం మార్కెట్​లో ఈ  గిఫ్టులకు మంచి క్రేజ్​ఉంది.  గిఫ్టులపై రకరకాల సందేశాలు  రాయిస్తూ ప్రేమను వ్యక్తపరిచేందుకు  రెడీ అవుతున్నారు. అప్పట్లో లవ్ లెటర్​ ఇస్తూ ప్రేమను తెలియజేసేవారు. ఇప్పుడు  కాస్త మాడ్రనైజ్ అయ్యింది.  గులాబీలు, ఉత్తరాలు ఇచ్చి సరిపెట్టుకోకుండా..  గుర్తుండిపోయే గిఫ్టులు ఇచ్చి ఇంప్రెషన్​ కొట్టేయాలని చూస్తున్నారు.  అభిరుచులకు, ఆలోచనలకు తగ్గట్టు పర్సనలైజ్డ్ గిఫ్ట్​లూ వచ్చాయి. అమ్మాయికి లేదా  అబ్బాయికి  నచ్చేలా గిఫ్ట్​లను తయారు చేయించి ఇస్తున్నారు.  ఇవైతే ఎప్పటికీ  గుర్తుండిపోతాయని భావిస్తున్నారు.  కస్టమైజ్డ్​ గిఫ్ట్​లు ఆన్​ లైన్​లోనూ హవా చేస్తున్నాయి.   రేటు ఎక్కువైనప్పటికీ స్పెషల్ అకేషన్  కావడంతో వీటిని  కొనేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు.  ఈ కస్టమైజ్డ్ గిఫ్ట్స్ చేసే వారికి ఆర్డర్లు కూడా ఎక్కువగానే వస్తున్నాయి.  

ట్రెండ్ మారింది.. 
గతంలో వాలంటైన్స్ డే సెలబ్రేషన్ అంటే ఇష్టమైన వాళ్లని కలిసి  గిఫ్ట్​ కార్డ్, రోస్ ఫ్లవర్ , చాక్లెట్లు, కేకులతో ప్రేమ పండుగ జరుపుకొనేవారు. ప్రస్తుతం ట్రెండ్ మారింది.  ప్రేమను వ్యక్తపరచడంలో మార్పులు వచ్చాయి. లవర్స్​కు తగ్గట్లే.. సిటీలో క్యాండిల్​ లైట్​ డిన్నర్​  లొకేషన్లు,  థీమెటిక్​ రెస్టారెంట్లు,  సర్​ప్రైజ్ పార్టీల కోసం స్పెషల్​ ప్లేస్​లు వచ్చేశాయి. వాలంటైన్స్ డే సెలబ్రేషన్స్ కోసం బేకరీలు, రెస్టారెంట్లు, షాపింగ్​ మాల్స్​ను అందంగా తయారు చేస్తున్నారు. మెనూ  చార్టులు, ప్రైస్​ లిస్టుల స్థానంలో ప్రేమ సందేశాలు రాసి.. కొత్త జంటల్ని ఇన్వైట్​ చేస్తున్నారు ఓనర్లు.   గిఫ్ట్​ స్టోర్లలో యూనిక్ ఐటెమ్స్ ను ఉంచుతున్నారు.  గిఫ్ట్​ కార్డ్స్​ నుంచి కస్టమైజ్డ్ వరకూ.. స్వచ్ఛమైన ప్రేమకు ముచ్చటైన బహుమతులుగా నిలవనున్నాయి. 

కపుల్ నేమ్స్​తో.. 
చాక్లెట్​ మీద కపుల్ నేమ్స్​తో పాటు  వాళ్ల మెసేజ్ రాయించుకుంటున్నారు.  నాలుగైదు రోజుల నుంచి  దాదాపు 500 ఆర్డర్లు వచ్చాయి.   వంద గ్రాముల చాక్లెట్ నుంచి కిలో చాక్లెట్​ వరకూ అందుబాటులో ఉన్నాయి. ఫ్లేవర్​ను బట్టి రూ.150 నుంచి రూ.1500 వరకు రేటు ఉంది. సర్‌‌‌‌‌‌‌‌ ‌‌‌‌‌‌‌‌ప్రైజ్ గిఫ్ట్​​లను  డోర్ డెలివరీ చేస్తున్నాం. 
- సత్య, లవ్లీ చాకోస్ వెబ్ సైట్ ఓనర్