మల్లారెడ్డి హాస్పిటల్ వద్ద కొనసాగుతున్న హైడ్రామా

మల్లారెడ్డి హాస్పిటల్ వద్ద కొనసాగుతున్న హైడ్రామా

కొడుకు మహేందర్ రెడ్డి చికిత్స పొందుతున్న హాస్పిటల్కు మంత్రి మల్లారెడ్డి తిరిగి చేరుకున్నారు. అంతకు ముందు ఆయన తన బంధువు ప్రవీణ్ రెడ్డి ఇంటికి వెళ్లారు. కాసేపట తర్వాత ప్రవీణ్ రెడ్డితో పాటు హాస్పిటల్ కు తిరిగి వచ్చారు. ప్రవీణ్ రెడ్డి ఇంట్లో కూడా ఐటీ సోదాలు జరుగుతుండటంతో వారి వెంట ఓ అధికారి కూడా హాస్పిటల్ కు వచ్చినట్లు సమాచారం. హాస్పిటల్ కు వచ్చినప్పుడు ప్రవీణ్ రెడ్డి చేతికి కట్టుతో కనిపించారు.

అంతకుముందు హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న మహేందర్ రెడ్డిని పరామర్శించేందుకు ఎమ్మెల్సీలు శంబిపూర్ రాజు, ఎల్ రమణ హాస్పిటల్ కువెళ్లారు. ఆయన యోగక్షేమాలు అడిగి తెలుసుకున్న అనంతరం కాసేపు మల్లారెడ్డితో మాట్లాడారు. అనంతరం ఎమ్మెల్యే వివేక్, ఎమ్మెల్సీలు శంబిపూర్ రాజు, ఎల్ రమణతో కలిసి మల్లారెడ్డి ఒకే కారులో బయటకు వెళ్లారు. 

మహేందర్ రెడ్డి హెల్త్ కండీషన్ స్టేబుల్గా ఉందని మల్లారెడ్డి చిన్న కోడలు డా. ప్రీతిరెడ్డి చెప్పారు. చెస్ట్, లెఫ్ట్ షోల్డర్ పెయిన్ తో ఆయనను హాస్పిటల్కు తీసుకువచ్చినట్లు చెప్పారు. గతంలోనూ ఆయనకు ఇలాంటి నొప్పి ఒకసారి వచ్చినట్లు ప్రీతి స్పష్టం చేశారు.