‘అఖండ2’ అప్డేట్.. సంయుక్త మీనన్తో బాలయ్య మాస్ స్టెప్పులు

‘అఖండ2’ అప్డేట్.. సంయుక్త మీనన్తో బాలయ్య మాస్ స్టెప్పులు

బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబోలో తెరకెక్కుతోన్న  క్రేజీ ప్రాజెక్ట్ ‘అఖండ2 : తాండవం’.  ప్రస్తుతం హైదరాబాద్‌‌‌‌లో వేసిన భారీ సెట్‌‌‌‌లో మాస్ సాంగ్‌‌‌‌ను షూట్ చేస్తున్నారు. ఆరువందల మంది డ్యాన్సర్లతో చాలా గ్రాండ్‌‌‌‌గా ఈ సాంగ్‌‌‌‌ను  తెరకెక్కిస్తున్నారు.  ‘అఖండ’లో  జై బాలయ్య  సాంగ్‌‌‌‌కు కొరియోగ్రఫీ చేసిన భాను మాస్టర్,  ఇప్పుడు ఈ పాటకు కూడా కొరియోగ్రఫీ చేస్తున్నాడు.  తమన్ కంపోజ్ చేసిన ఈ పాటలో బాలయ్య మాస్ డ్యాన్స్ మూమెంట్స్‌‌‌‌తో అలరించనున్నారని, ఈ పాట థియేటర్లలో అభిమానులను ఉర్రూతలూగించేలా ఉండబోతోందని  మేకర్స్ చెప్పారు.

సంయుక్త మీనన్ హీరోయిన్‌‌‌‌గా నటిస్తున్న ఈ చిత్రంలో ఆది పినిశెట్టి కీలక పాత్రలో కనిపించనున్నాడు. తేజస్విని నందమూరి సమర్పణలో 14 రీల్స్ ప్లస్ బ్యానర్‌‌‌‌పై రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.  డిసెంబర్‌‌‌‌‌‌‌‌లో సినిమా రిలీజ్‌‌‌‌కు ప్లాన్ చేస్తున్నారు.  నాలుగేళ్ల తర్వాత ‘అఖండ’కు సీక్వెల్‌‌‌‌గా రూపొందుతోన్న చిత్రంతో పాటు, బాలకృష్ణ, బోయపాటి  కాంబినేషన్‌‌‌‌లో తెరకెక్కుతోన్న  నాలుగో చిత్రం కావడంతో అంచనాలు ఏర్పడ్డాయి.