MPTC, ZPTC ఎన్నికలకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్

MPTC, ZPTC ఎన్నికలకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్
  • స్థానిక సంస్థల ఎన్నికలకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్
  • జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలను ఆపలేం : హైకోర్టు
  • రిజర్వేషన్ల పిటిషన్ పై 3 వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలి
  • ప్రభుత్వాన్ని ఆదేశించిన రాష్ట్ర హైకోర్టు
  • తదుపరి విచారణను ఈ నెల 22 వ తేదీకి వాయిదా

రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ZPTC, MPTC ఎన్నికలను ఈ పరిస్థితుల్లో ఆపలేమని కోర్టు చెప్పింది. ఎన్నికలు నిలిపివేయాలంటూ… బీసీ సంఘం నేతలు వేసిన పిటిషన్ ను కోర్టు పక్కకు పెట్టింది.

సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం… స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్లు 50శాతం మించకూడదని సూచించింది హైకోర్టు. రిజర్వేషన్ల పిటిషన్ పై 3 వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఏప్రిల్ 22 వ తేదీ ఈ కేసు మరోసారి కోర్టు ముందుకు రానుంది.

బీసీలకు అన్యాయం జరుగుతుందని, బీసీ రిజర్వేషన్ల కోటా కేటాయించిన తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని బీసీ సంఘం నేతలు ఇటీవల హైకోర్టులో రిట్ పిటిషన్ వేశారు. ఎన్నికలను ఇప్పుడు ఆపలేమని తేల్చి చెప్పిన కోర్టు.. ఈ కేసులో ఈసీ, పంచాయతీ రాజ్ ప్రిన్సిపల్ సెక్రటరీ, ఎన్నికల సంఘం, తెలంగాణ బీసీ కార్పొరేషన్, ఫైనాన్స్ కార్పొరేషన్ కు నోటీసులు పంపింది. 3 వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది.