ర్యాగింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు విద్యార్థిని బలి .. హిమాచల్‌‌‌‌‌‌‌‌ ప్రదేశ్ లోని ధర్మశాలలో ఘటన

ర్యాగింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు విద్యార్థిని బలి ..    హిమాచల్‌‌‌‌‌‌‌‌ ప్రదేశ్ లోని  ధర్మశాలలో ఘటన

ధర్మశాల: ర్యాగింగ్‌‌‌‌‌‌‌‌కు మరో విద్యార్థిని బలైంది. సీనియర్లు, ఓ ప్రొఫెసర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పెట్టిన టార్చర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు మానసిక వేదనకు గురై, హాస్పిటల్‌‌‌‌‌‌‌‌లో చికిత్స పొందుతూ మృతి చెందింది. హిమాచల్‌‌‌‌‌‌‌‌ ప్రదేశ్‌‌‌‌‌‌‌‌లోని ధర్మశాలలో ఈ ఘటన జరిగింది. ధర్మశాలలోని ప్రభుత్వ కాలేజీలో ఓ యువతి డిగ్రీ సెకండియర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చదువుతోంది. చాలా రోజుల నుంచి సీనియర్లు ఆమెను ర్యాగింగ్‌‌‌‌‌‌‌‌ చేస్తున్నారు. 

సెప్టెంబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 18న ముగ్గురు సీనియర్లు ర్యాగింగ్‌‌‌‌‌‌‌‌ పేరుతో దారుణంగా ప్రవర్తించారు. ఓ ప్రొఫెసర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆ యువతిపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. తోటి స్టూడెంట్స్‌‌‌‌‌‌‌‌ టార్చర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు తోడు ప్రొఫెసర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లైంగిక వేధింపులను యువతి తీవ్ర ఒత్తిడికి, తద్వారా అనారోగ్యానికి గురైంది. తల్లిదండ్రులు ఆమెను హాస్పిటల్‌‌‌‌‌‌‌‌లో అడ్మిట్‌‌‌‌‌‌‌‌ చేయగా, చికిత్స పొందుతూ మృతి చెందింది.