జమ్మికుంట, వెలుగు : సికింద్రాబాద్ నుంచి హిసార్ వెళ్తున్న ఎక్స్‌ప్రెస్ రైలుకు బుధవారం రాత్రి పెను ప్రమాదం తప్పింది. రాత్రి రెండు గంటల సమయంలో ఎక్స్‌ప్రెస్ రైలు కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలం మడిపల్లి శివారులోకి రాగానే.. రైలు ఇంజిన్ చక్రం విరిగినట్లు సిబ్బంది గమనించి వెంటనే రైలును నిలిపివేశారు. వెంటనే మరో రైల్ ఇంజిన్‌ను తీసుకొచ్చి ట్రైన్‌ను పంపించారు. ఈ సమయంలో దక్షిణ్ ఎక్స్‌ప్రెస్‌ను కమలాపూర్ మండలం ఉప్పల్ వద్ద ఆఫీసర్లు నిలిపివేశారు. సిబ్బంది సకాలంలో గుర్తించడంతో పెను ప్రమాదం తప్పిందని రైల్వే అధికారులు తెలిపారు.
