భారత్ మాతా చౌక్ గా జమ్మూలోని సిటీ చౌక్

భారత్ మాతా చౌక్ గా జమ్మూలోని సిటీ చౌక్

జమ్మూకశ్మీర్ లో ఆర్టికల్ 370 రద్దు.. ఆ తర్వాత ఆ రాష్ట్రాన్ని రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా మార్పు చేసింది కేంద్ర ప్రభుత్వం. ఇందులో భాగంగా కొన్ని ప్రాంతాల పాత పేర్లను మార్చి కొత్త పేర్లు  పెడుతున్నారు. పాత జమ్ము కమర్షియల్ హబ్ లో ఉన్న చారిత్రాత్మక ‘సిటీ చౌక్’ పేరును మార్చారు. సిటీ చౌక్ పేరును ‘భారత్ మాతా చౌక్’గా నామకరణం చేశారు. ఈ విషయాన్ని బీజేపీ అధికారంలో ఉన్న జమ్ము మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు ప్రకటించారు.

సిటీ చౌక్ పేరు మార్పుపై ప్రజల నుంచి మిశ్రమ స్పందన వస్తోంది. ఎక్కువ మంది పేరు మార్పును స్వాగతిస్తున్నారు. మరికొందరు పేరు మార్పు ముఖ్యం కాదని… నగర అభివృద్ధి, పరిశుభ్రతపై దృష్టి సారించాలని సూచిస్తున్నారు.

మరోవైపు జమ్ములోని పంజ్ తీర్థి దగ్గర ఉన్న సర్క్యులర్ రోడ్డు స్టార్టింగ్ పాయింట్ కు దివంగత ప్రధాని స్మారకార్థం ‘అటల్ చౌక్’గా నామకరణం చేశారు.