హైదరాబాద్ లో ప్రీలాంచ్ ఆఫర్.. తక్కువ ధరకే ప్లాట్లు అంటూ రూ.500 కోట్ల మోసం

హైదరాబాద్ లో ప్రీలాంచ్ ఆఫర్.. తక్కువ ధరకే ప్లాట్లు అంటూ రూ.500 కోట్ల మోసం

హైదరాబాద్: ప్రీలాంచ్ ఆఫర్ పేరుతో తక్కువ ధరకే ఫ్లాట్లు నిర్మించి ఇస్తామని చెప్పి తమ నుంచి కోట్లాది రూపాయలు వసూలు చేసి మోసం చేశారని ఆరోపిస్తూ పలువురు కేంద్ర ప్రభుత్వ, సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు హైదరాబాద్ సీసీఎస్ పోలీసులను ఆశ్రయించారు. త్రిపురా కన్స్ట్రక్షన్ కంపెనీ చైర్మన్ పసుపులేటి సుధాకర్‌పై ఫిర్యాదు చేశారు.

బాధితుల వివరాల ప్రకారం.. 2021లో సంగారెడ్డి జిల్లా తెల్లాపూర్‌లో తక్కువ ధరకే ఫ్లాట్లు నిర్మించి ఇస్తామని త్రిపురా కన్స్ట్రక్షన్ సంస్థ ప్రీలాంచ్ ఆఫర్ ప్రకటించింది. సొంతింటి కలను సాకారం చేసుకోవాలనే ఆశతో పలువురు బీడీఎల్, సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు ఈయితే డబ్బులు తీసుకున్న అనంతరం ఫ్లాట్ల నిర్మాణం చేపట్టకుండా సంస్థ ప్రతినిధులు కాలయాపన చేస్తూ వచ్చారని వారు ఆరోపించారు. తమకు ఫ్లాట్లు నిర్మిస్తామని చెప్పి కొనుగోలు చేసిన భూమిని ప్రస్తుతం మరో రియల్ ఎస్టేట్ సంస్థకు విక్రయించేందుకు ప్రాజెక్టులో పెట్టుబడులు పెట్టారు. ఒక్కొక్కరు లక్షల రూపాయలు చెల్లించినట్లు బాధితులు తెలిపారు.

అయితే డబ్బులు తీసుకున్న అనంతరం ఫ్లాట్ల నిర్మాణం చేపట్టకుండా సంస్థ ప్రతినిధులు కాలయాపన చేస్తూ వచ్చారని వారు ఆరోపించారు. తమకు ఫ్లాట్లు నిర్మిస్తామని చెప్పి కొనుగోలు చేసిన భూమిని ప్రస్తుతం మరో రియల్ ఎస్టేట్ సంస్థకు విక్రయించేందుకు ప్రయత్నిస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు.సుమారు 350 మంది నుంచి రూ.500 కోట్ల వరకు వసూలు చేశారని బాధితులు ఆరోపించారు. 

సొంతింటి కోసం ఎంతో కష్టపడి కూడబెట్టుకున్న డబ్బులను చెల్లించామని, అయితే ఇప్పటివరకు ఫ్లాట్లు ఇవ్వకపోగా తమ డబ్బును కూడా తిరిగి చెల్లించడం లేదని వాపోయారు.ఈ వ్యవహారంపై సమగ్ర దర్యాప్తు చేపట్టి త్రిపురా కన్స్ట్రక్షన్ కంపెనీ చైర్మన్ పసుపులేటి సుధాకర్‌పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని బాధితులు సీసీఎస్ పోలీసులను కోరారు. తమ నుంచి తీసుకున్న డబ్బులను తిరిగి ఇప్పించి న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు.