తప్పతాగాడు.. ఆపై కారెక్కి స్టీరింగ్ పట్టుకున్నాడు. అర్థరాత్రి కావటంతో రోడ్లపై జనం రద్దీ తక్కువగా ఉండటంతో.. కారు స్పీడ్ కు హద్దేలేదు. గల్లీల్లో వెళుతున్నామా.. జాతీయ రహదారిపై వెళుతున్నామా అనేది కూడా చూసుకోకుండా.. ర్యాష్ డ్రైవింగ్ చేస్తూ.. ఓ బైక్ ను ఢీకొని.. బైక్ పై ఉన్న వ్యక్తిని ఈడ్చుకెళ్లాడు కారు డ్రైవర్. హైదరాబాద్ సిటీ నడుబొడ్డున.. కూకట్ పల్లిలో జరిగిన ఈ ఘటన కలకలం రేపుతోంది. పూర్తి వివరాల్లోకి వెళితే..
కేపీహెచ్ బీలో మార్కెటింగ్ జాబ్ చేస్తున్న ప్రశాంత్ అనే వ్యక్తి ఆదివారం అర్ధరాత్రి ఇనోవా కారు గుద్దింది. రాత్రి విధులు నిర్వహించుకుని ఇంటికి తిరిగి వస్తున్న టైంలో జన్సిస్ స్కూల్ వద్ద స్పీడ్ గా వచ్చిన ఏపీ28 ఏఆర్ 2269 ఇన్నోవా కారు టీఎస్ 04 ఈక్యూ9688 బైక్ ను ఢీ కొట్టి ఈడ్చుకెళ్లింది. దాంతో బైక్ నడుపుతున్న ప్రశాంత్ అక్కడికక్కడే మృతి చెందాడు.
స్థానికంగా ఉన్న సీసీటీవీ కెమెరాల్లో రికార్డు అయిన ఫుటేజ్ ను ఆధారంగా తీసుకున్న కూకట్ పల్లి పోలీసులు.. దర్యాప్తు చేపట్టారు. అందులో ఇనోవా కారు నడిపింది భూపతి అనే వ్యక్తిగా పోలీసులు గుర్తించారు. అతనికి డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ చేయగా.. మద్యం సూవించినట్లు పోలీసులు గుర్తించారు. అతనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
