మైలార్ దేవ్‎పల్లి PS పరిధిలో హిట్ అండ్ రన్.. బైక్‎ను ఢీకొట్టి 200 మీటర్ల లాక్కెళ్లిన కారు

మైలార్ దేవ్‎పల్లి PS పరిధిలో హిట్ అండ్ రన్.. బైక్‎ను ఢీకొట్టి 200 మీటర్ల లాక్కెళ్లిన కారు

హైదరాబాద్: మైలార్ దేవ్‎పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో హిట్ అండ్ రన్ కేసు నమోదు అయ్యింది. బైక్‎ను ఢీకొట్టిన కారు 200 మీటర్లు ఈడ్చుకెళ్లింది. వెంబడించి కారును పట్టుకున్న స్థానికులు కార్ డ్రైవర్‎ను చితకబాది పోలీసులకు అప్పగించారు. వివరాల ప్రకారం.. ఆదివారం (మార్చి 8) రాత్రి నలుగురు యువకులు షాద్ నగర్ నుంచి చార్మినార్‎కు షాపింగ్‎కు వెళ్తున్నారు. 

ఈ క్రమంలో మైలార్ దేవ్‎పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని పల్లె చెరువు దగ్గర మితిమీరిన వేగంతో దూసుకొచ్చిన కారు బైక్‎లను ఢీకొట్టింది. ఓ బైక్ కారు ముందు భాగంలో ఇరుక్కున్నప్పటికీ కారు ఆపకుండా అలాగే 200 మీటర్ల వరకు ఈడ్చుకెళ్లాడు కార్ డ్రైవర్. కారును వెంబడించి పట్టుకున్న స్థానికులు డ్రైవర్‎ను చితకబాదారు. అనంతరం పోలీసులకు అప్పగించారు. ఈ ఘటనపై మైలార్ దేవ్‎పల్లి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కారు నడిపిన వ్యక్తిని కిశోర్‎కు గుర్తించారు.