స్కూలులో జరిగే బడిబాటకు వెళ్తూ హెచ్ఎం మృతి

స్కూలులో జరిగే బడిబాటకు వెళ్తూ హెచ్ఎం మృతి


నాగర్ కర్నూల్ టౌన్, వెలుగు:  బడిబాట కార్యక్రమానికి  బైక్​పై వెళ్తుండగా పంది అడ్డం రావడంతో కిందపడి ఓ హెడ్​మాస్టర్​ తీవ్ర గాయాలతో చనిపోయారు.  ఆదివారం బడిబాట కార్యక్రమానికి  హెచ్ఎం బిచ్చారావు(50)  నాగర్ కర్నూల్  నుంచి తాడూరు మండలం మేడిపూరు గ్రామానికి బైక్ పై వెళ్తుండగా, ఎండబెట్ల గ్రామ శివారులో  పంది అడ్డం వచ్చింది.  దీంతో  బైక్​ అదుపుతప్పి కిందపడిన హెచ్​ఎంకు తీవ్రగాయాలయ్యాయి.  హైదరాబాద్ లో ఓ హాస్పిటల్​లో తరలించగా..  చికిత్స పొందుతూ చనిపోయారు. ఆయనకు భార్య,  కూతురు ఉన్నారు.