హైదరాబాద్, వెలుగు: మోకిల ఫేజ్ 2 లో ఈ నెలలో జరగనున్న ప్లాట్ల వేలంపై గురువారం హెచ్ఎండీఏ అధికారులు ప్రీ బిడ్ మీటింగ్ నిర్వహించనున్నారు. మొత్తం 300 ప్లాట్లకు ఈ నెల 23 నుంచి 5 రోజులపాటు రోజుకు 60 ప్లాట్లకు ఆన్ లైన్లో వేలం జరగనుంది. 300 గజాల నుంచి 500 గజాల వరకు ప్లాట్లు ఉండగా కనీస ధర గజానికి రూ.25వేలుగా అధికారులు ఖరారు చేశారు. ప్లాట్ల వేలం ద్వారా రూ.850 కోట్లు లాభం వస్తుందని హెచ్ఎండీఏ అంచనా వేస్తోంది. ఫేజ్ 1 లో వేలం నిర్వహించినప్పుడు గజం లక్ష వరకు పలకింది.

