
హైదరాబాద్ లో హోలీ వేడుకలు అట్టహాసంగా జరుగుతున్నాయి. వరుసగా మూడు రోజులు సెలవులు రావడంతో జనాలు .. యూత్ హోలీ ఆడి చిందేస్తున్నారు. రంగు జల్లుకుంటూ కేరింతలు కొడుతున్నారు. చిన్నా.. పెద్ద.. ఆడ.. మగ .. తేడా లేకుండా సంబరాల్లో మునిగి తేలుతున్నారు. ప్రతి గల్లీలో కుర్రకారు డీజే సాంగ్స్.. రెయిన్ డ్యాన్స్‌లతో ఉర్రూతలూగిస్తారు.
కూకట్ పల్లి .. మలేషియన్ టౌన్ షిప్ లో
గేటెడ్ కమ్యూనిటీల్లో హోలీ సంబరాల కోసం ఏర్పాట్లు ఆర్గనైజర్లు ఏర్పాట్లు చేశారు. కూకట్పల్లి లోని మలేషియన్ టౌన్ షిప్ లో ఘనంగా హోలీ సంబరాలు అంబనాన్ని తాకాయి. విద్యార్థులు.. ఎంప్లాయీస్ రంగులు పూసుకుంటూ.. డ్యాన్స్ లు చేస్తూ కేరింతలు కొడుతున్నారు. ఫన్ యాక్టివిటీస్ లో పాల్గొంటూ.. జనాలు సందడి చేస్తున్నారు. నాంపల్లి ఎగ్జిబిషన్‌గ్రౌండ్‌లో యువత హోలీసంబరాల్లో పాల్గొంటూ డీజే సౌండ్స్.. డ్యాన్స్‌లతో రెచ్చిపోయారు.
షాద్ నగర్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో
రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ నియోజకవర్గం క్యాంపు కార్యాలయంలో హోలీ సంబరాల్లో ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ స్థానికులతో కలిసి హోలీ ఆడారు. యువకులతో రంగులు చల్లుతూ పాటలకు స్టెప్పులు వేశారు. ప్రతి ఒక్కరు హోలీ పండుగ సంతోషంగా జరుపుకోవాలని జీవితం రంగుల మయమయ్యే దారిని ఎంచుకోవాలని అన్నారు.