16న డాక్యుమెంట్ల తో రావాలి : ఇన్‌‌‌‌‌‌‌‌స్పెక్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నరేందర్‌‌‌‌‌‌‌‌

16న డాక్యుమెంట్ల తో రావాలి : ఇన్‌‌‌‌‌‌‌‌స్పెక్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నరేందర్‌‌‌‌‌‌‌‌

హైదరాబాద్‌‌‌‌‌‌‌‌, వెలుగు :  డబ్బులు వసూలు కేసులో బంజారాహిల్స్‌‌‌‌‌‌‌‌ ఇన్‌‌‌‌‌‌‌‌స్పెక్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నరేందర్‌‌‌‌‌‌‌‌,‌‌‌‌‌‌‌‌ అడ్మిన్‌‌‌‌‌‌‌‌ ఎస్‌‌‌‌‌‌‌‌ఐ నవీన్‌‌‌‌‌‌‌‌రెడ్డి, హోంగార్డు హరిని సోమవారం ఏసీబీ అధికారులు విచారించారు. నాంపల్లిలోని సిటీ రేంజ్‌‌‌‌‌‌‌‌ ఆఫీసులో ఉదయం11.30గంటల నుంచి ప్రశ్నించారు. ఈనెల16న మరోసారి హాజరుకావాలని ఆదేశించింది. రాక్‌‌‌‌‌‌‌‌ క్లబ్ స్కై లాంజ్‌‌‌‌‌‌‌‌ మేనేజింగ్ పార్ట్‌‌‌‌‌‌‌‌నర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రాజేశ్వర్‌‌‌‌‌‌‌‌, ‌‌‌‌‌‌‌‌లక్ష్మణ్‌‌‌‌‌‌‌‌రావును మామూళ్ల కోసం వేధిస్తున్నారనే ఫిర్యాదుతో ఇన్‌‌‌‌‌‌‌‌స్పెక్టర్, ఎస్‌‌‌‌‌‌‌‌ఐ

హోంగార్డును ఏసీబీ గత శుక్రవారం అదుపులోకి తీసుకున్నది తెలిసిందే. ముగ్గురి కాల్‌‌‌‌‌‌‌‌డేటా,వాట్సాప్‌‌‌‌‌‌‌‌ కాల్స్‌‌‌‌‌‌‌‌, బ్యాంక్‌‌‌‌‌‌‌‌ స్టేట్‌‌‌‌‌‌‌‌మెంట్స్‌‌‌‌‌‌‌‌కు సంబంధించిన డాక్యుమెంట్స్‌‌‌‌‌‌‌‌తో మళ్లీ తమ ముందు హాజరుకావాలని ఏసీబీ ఆదేశించింది. 

సీఐ నరేందర్ సస్పెన్షన్

పబ్ ఓనర్ నుంచి లంచం డిమాండ్ చేశాడని ఆరోపణల్లో విచారణ ఎదుర్కొంటున్న సీఐ నరేందర్​పై  సస్పెన్షన్ వేటు పడింది. ఆయనను సస్పెండ్  చేస్తూ సిటీ సీపీ ఆనంద్ సోమవారం రాత్రి ఉత్తర్వులు   జారీ చేశారు.